శ్లాక్ యూజరా.. మరి పాస్‌వర్డ్ ఛేంజ్ చేశారా!
close

Published : 13/02/2021 12:18 IST
శ్లాక్ యూజరా.. మరి పాస్‌వర్డ్ ఛేంజ్ చేశారా!

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బిజినెస్ కమ్యూనికేషన్‌ యాప్‌ శ్లాక్ యూజర్స్‌ అందరికీ కీలక సూచన చేసింది. యూజర్స్ అందరు వెంటనే తమ యాప్‌ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచించింది. శ్లాక్‌ యాప్‌ కొత్త వెర్షన్‌లో బగ్ కారణంగా కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్స్‌ పాస్‌వర్డ్ సమాచారం బహిర్గతం అయినట్లు కంపెనీ తెలిపింది. దీంతో సదరు యూజర్స్ అందరూ తమ పాస్‌వర్డ్‌లను తక్షణమే మార్చుకోవాలని కంపెనీ యూజర్స్‌కి పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొంది. ఈ బగ్ వల్ల ఈ-మెయిల్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్‌ అయ్యే యూజర్స్‌ డేటా మాత్రమే లీక్ అయిందని, సింగిల్ సైన్‌-ఆన్‌ (ఎస్‌ఎస్‌ఓ) యూజర్స్‌కి దీంతో ఎలాంటి సమస్యా లేదని శ్లాక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బగ్‌ను సరిచేసినట్లు వెల్లడించింది. 

పాస్‌వర్డ్ మార్చుకునేందుకు కంపెనీ పంపిన మెయిలోని లింక్‌పై క్లిక్ చేయాలని సూచించింది. ఒకవేళ లింక్‌ ఓపెన్ కాకపోతే సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్ మార్చుకోవాలి. అలానే శ్లాక్‌ ఈ-మెయిల్ చేసిన యూజర్స్ అందరూ తమ యాప్‌ డేటాను వెంటనే డిలీట్ చేయాలని కోరింది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌పై క్లిక్‌ చేసి శ్లాక్‌ యాప్‌ ఓపెన్‌ చెయ్యాలి. అందులో స్టోరేజ్‌పై క్లిక్‌ చేసి క్లియర్ డేటా సెలెక్ట్‌ చేస్తే డేటా మొత్తం డిలీట్ అవుతుంది. ఈ ప్రక్రియ కష్టంగా అనిపిస్తే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి తిరిగి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలానే లీక్ అయిన డేటా హ్యాకర్స్‌ చేతికి చిక్కినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించింది.

శ్లాక్‌ యాప్ ఒకవిధమైన మెసేజింగ్ యాప్. కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తుంటారు. అందర్నీ గ్రూపుగా క్రియేట్ చేసి అందులో తమ అభిప్రాయాల్ని, వృత్తికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. డిలీట్ చేయకుండా ఉంటే పదివేల మెసేజ్‌ల వరకు స్టోర్ అవుతాయి. ఇందులో వీడియోకాల్స్‌ కూడా చేసుకోవచ్చు.  

ఇవీ చదవండి..

యాపిల్ వాచ్‌తో కొవిడ్-19 లక్షణాల గుర్తింపు..!

డేటా లీక్ ఆరోపణలను ఖండించిన ‘కూ’ సీఈవో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న