Apply Now: సీబీఎస్‌ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేశారా?
తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) స్కాలర్‌షిప్ అందజేస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారు ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: మీరు అమ్మాయిలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? అయితే, సీబీఎస్‌ఈ ప్రకటించిన ఈ మెరిట్ స్కాలర్‌షిప్(CBSE Merit Scholarship) మీ కోసమే. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) స్కాలర్‌షిప్ అందజేస్తోంది. ఇందులో భాగంగా 2023 సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అక్టోబర్ 18వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
- తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా 2006 నుంచి ఈ మెరిట్ స్కాలర్‌షిప్‌ను అమలు చేస్తున్నారు.
- ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు నెలకు ₹500ల చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు.
- దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తుండాలి.
- పదో తరగతి పరీక్షల్లో కనీసం 60శాతం మార్కులు(ఐదు సబ్జెక్టుల్లో) సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్ అవార్డుకు అర్హులు. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 కన్నా మించి ఉండరాదు.
- సెప్టెంబర్ 19న మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 18 వరకు కొనసాగుతుంది. దరఖాస్తులను ఆయా పాఠశాలలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 25 మధ్య వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
- ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
- భారతదేశ పౌరులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. ఎన్నారైలు కూడా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. కాకపోతే వారి ట్యూషన్ ఫీజు నెలకు గరిష్ఠంగా రూ.6000 ఉండాలని నిబంధన విధించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పదవీ విరమణ వయసులో.. సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ
-
ఏపీకి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!