Practice Papers: ప్రాక్టీస్‌ పేపర్లపై ఆ ప్రకటనలు నమ్మొద్దు.. విద్యార్థులకు CBSE అలర్ట్‌

CBSE Practice papers: నమూనా ప్రశ్నా పత్రాల కోసం డబ్బులు చెల్లించాలంటూ సీబీఎస్‌ఈ ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తోందని, డబ్బులు చెల్లించి ఆ పేపర్లను పొందొచ్చని కొన్ని కథనాలు వచ్చాయి. వాటిపై బోర్డు స్పందించింది.

Published : 14 Sep 2023 16:57 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన నమూనా పేపర్ల (sample papers) విషయంలో మోసాలు జరుగుతున్నాయని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) విద్యార్థులు, వారి తల్లిదండ్రులను హెచ్చరించింది. ప్రాక్టీస్‌ పేపర్ల (practice papers)ను అందించేందుకు తాము ఏ ప్రైవేటు పబ్లిషర్‌తో ఒప్పందం చేసుకోలేదని, వాటికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

బోర్డు పరీక్షల నమూనా పత్రాల కోసం సీబీఎస్‌ఈ (CBSE).. ఎడ్యుకార్ట్‌ అనే సంస్థతో కలిసి పనిచేస్తోందని, కొంత మొత్తం వెచ్చించి ఆ ప్రాక్టీస్‌ పేపర్లను పొందొచ్చని కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సదరు కథనాలపై సీబీఎస్‌ఈ స్పందిస్తూ స్పష్టతనిచ్చింది.

‘‘జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సుల ప్రకారం.. సీబీఐఎస్‌ తమ అనుబంధ స్కూళ్లలో Competency Focused Education and Assessment విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే 10, 12వ తరగతుల్లోని ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టీస్‌ పేపర్లను ఇటీవల విడుదల చేశాం. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు, టాపిక్స్‌ను సులువుగా అర్థం చేసుకునేందుకు ఈ పేపర్లు ఉపయోగపడుతాయి’’ అని సీబీఎస్ఈ తమ అడ్వైజరీలో పేర్కొంది.

ఆర్‌బీఐ పిలుస్తోంది..: అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన

‘‘అయితే, కొన్ని ప్రైవేటు పబ్లిషర్ల సైట్ల నుంచి ఆ ప్రాక్టీస్‌ పేపర్లను యాక్సెస్‌ చేసుకోవచ్చని కొన్ని స్కూళ్లు, విద్యార్థులను ఆయా సంస్థలు కోరినట్లు బోర్డు దృష్టికి వచ్చింది. కానీ, మేం ఈ నమూనా పేపర్లను అందించడం కోసం ఏ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకోలేదు. అలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రమోషన్లను చూసి మోసపోవద్దు’’ అని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు