CBSE- CTET: సీటెట్ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్) (CTET) అడ్మిట్‌ కార్డులను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది.

Published : 18 Aug 2023 11:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్) (CTET) అడ్మిట్‌ కార్డులను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను (hall tickets)డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://ctet.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

సీటెట్‌కు ఏప్రిల్‌ 27న సీబీఎస్‌ఈ నోటిఫికేషన్‌‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఆగస్టు 20న సీటెట్‌ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని