ఐసీఎస్‌ఐ పరీక్షలో మార్పులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) పరీక్షా విధానంలో ఈ డిసెంబర్‌ నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Published : 31 Oct 2023 01:02 IST

న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) పరీక్షా విధానంలో ఈ డిసెంబర్‌ నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రతి ప్రశ్నపత్రానికి విద్యార్థులకు 15 నిమిషాల సమయం అదనంగా లభించనుంది. కొత్త సిలబస్‌ను ఆధారంగా చేసుకుని నిర్వహించే పరీక్షల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది.

  • మొత్తం సిలబస్‌ను ఇటీవల సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మార్చారు. కొత్తగా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అందరికీ నూతన సిలబస్‌ వర్తిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ విద్యార్థులకు కొత్త సిలబస్‌తో డిసెంబర్‌ 2023లో పరీక్ష నిర్వహిస్తారు, ప్రొఫెషనల్‌ విద్యార్థులకు మాత్రం మాత్రం జూన్‌ 2024లో ఈ పరీక్ష ఉంటుంది.
  • పాత సిలబస్‌ చదువుతున్న వారికి డిసెంబర్‌ 2023, జూన్‌ 2024లో అదే సిలబస్‌తో పరీక్ష రాసేందుకు మరో రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో కావాలంటే వారు కొత్త సిలబస్‌తో కూడా పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇలా సిలబస్‌ను మార్చుకుని పరీక్షకు దరఖాస్తు చేసేందుకు రిజిస్ట్రేషన్‌ విండో 2023, నవంబర్‌ 21 నుంచి అందుబాటులో ఉంటుంది.  
  • ఈ పరీక్షకు సంబంధించి గతంలో ఉన్న 17 ప్రశ్నపత్రాలను 14 పత్రాలకు కుదించారు. ప్రాక్టికల్‌ అవగాహనను పరీక్షించే దిశగా మార్పులు చేర్పులు చేశారు. అంతేకాక కొత్త ప్రశ్నపత్రాల్లో కేస్‌ స్టడీ ఆధారిత ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలను 20 మార్కులకు అడుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని