గీతంలో ఫిజియోథెరపీ

ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతోన్న కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. దీనికున్న ప్రాధాన్యం దృష్ట్యా గీతం యూనివర్శిటీ (విశాఖపట్నం)...

Updated : 09 Aug 2021 06:36 IST

ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతోన్న కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. దీనికున్న ప్రాధాన్యం దృష్ట్యా గీతం యూనివర్శిటీ (విశాఖపట్నం) ఈ విద్యాసంవత్సరం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు అందిస్తోంది. పరీక్షలో ప్రతిభ చూపినవారు ట్యూషన్‌ ఫీజులో రాయితీ పొందవచ్చు.

నాలుగు సంవత్సరాల వ్యవధి ఉండే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. అర్హత: 60 శాతం మార్కులతో బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత (2019, 2020, 2021లో ఉత్తీర్ణులు అర్హులు) ప్రవేశం: గీతం ఆప్టిట్యూడ్‌ టెస్టు (గాట్‌) స్కోరుతో. పరీక్షలో: గాట్‌లో.. బయాలజీ నుంచి 40, ఫిజిక్స్‌ నుంచి 30, కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు. దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15 ప్రవేశపరీక్షలు: ఆగస్టు 17, 18న నిర్వహిస్తారు. స్కాలర్‌షిప్పు: గాట్‌లో 180, ఆపైన మార్కులు పొందినవారికీ; అలాగే నీట్‌లో లక్షలోపు ర్యాంకు సాధించినవారికీ మొదటి ఏడాది వంద శాతం ట్యూషన్‌ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. 160 మార్కులు లేదా నీట్‌లో 1,50,000లోపు ర్యాంకు సాధించినవారికి 75 శాతం, 140 మార్కులు లేదా నీట్‌లో 2 లక్షలలోపు ర్యాంకు వస్తే 50 శాతం, 120 మార్కులు లేదా నీట్‌లో 2.5 లక్షలలోపు ర్యాంకు సాధిస్తే 25 శాతం ట్యూషన్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది.

https://gat.gitam.edu/Physiotherapy/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని