5500 ఉపకార వేతనాలు

ఉపకార వేతనాలతో విద్యార్థులకు ప్రోత్సాహం అందించి దేశంలో విద్యాప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రధానమంత్రి  స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ (పీఎంఎస్‌ఎస్‌)ను ప్రవేశపెట్టారు. 2022 సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Published : 11 Oct 2022 00:15 IST

పీఎం స్కాలర్‌షిప్‌ స్కీమ్‌

ఉపకార వేతనాలతో విద్యార్థులకు ప్రోత్సాహం అందించి దేశంలో విద్యాప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రధానమంత్రి  స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ (పీఎంఎస్‌ఎస్‌)ను ప్రవేశపెట్టారు. 2022 సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దీన్ని కేంద్రీయ విద్యాలయ సైనిక్‌ బోర్డ్‌ సెక్రటేరియట్‌ (కేఎస్‌బీ) నిర్వహిస్తోంది.

ర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్ట్‌గార్డ్స్‌లో పనిచేసినవారి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకమిది. ఆర్థిక సమస్యల కారణంగా వీరు ఉన్నత విద్యకు దూరం కాకుండా ఈ స్కాలర్‌షిప్‌ ఉపయోగపడుతుంది. అర్హతలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. నవంబరు 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
10+2/గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు దరఖాస్తు చేయడానికి అర్హులు. డ్యూయల్‌ డిగ్రీ చదువుతోన్న విద్యార్థుల విషయంలో మొదటి డిగ్రీని మాత్రమే పరిగణనలోకి తీసుకుని స్కాలర్‌షిప్‌ను మంజూరు చేస్తారు. ఉదాహరణకు బీఈ+ఎంఈ, బీటెక్‌+ఎంటెక్‌, బీబీఏ+ఎంబీఏ చదువుతుంటే మొదటి ప్రొఫెషనల్‌ డిగ్రీకి మాత్రమే ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఎంపికచేసిన విద్యార్థుల వివరాల జాబితాను కేఎస్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

* స్కాలర్‌షిప్‌కు ఎంపికైన తర్వాత అడ్రస్‌, కోర్సు, కాలేజీలో ఏమైనా మార్పులు ఉంటే వెంటనే కేంద్రీయ సైనిక్‌ బోర్డుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. సంప్రదింపుల సమయంలో విద్యార్థి పేరు, ఈఎస్‌ఎం/ఎక్స్‌-కోస్ట్‌ గార్డ్‌ వివరాలను తప్పకుండా తెలియజేయాలి.
* మొత్తం 5500 స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. బాల బాలికలకు సమాన సంఖ్యలో మంజూరు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని విడుదల చేస్తారు. బాలికలకు రూ.36,000, బాలురకు రూ.30,000 చెల్లిస్తారు. కోర్సు కాలవ్యవధిని బట్టి ఏడాది లేదా ఐదేళ్ల కాలానికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.
* మొదటి సంవత్సరం స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని బ్యాంక్‌ ఎకౌంట్‌లో జమచేస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలోనూ ఇదే విధంగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే విద్యార్థి ఏటా 50 శాతం మార్కులు సాధించాలి. ఏదైనా సబ్జెక్టు/ సెమిస్టర్‌లో ఫెయిల్‌ అయితే స్కాలర్‌షిప్‌ను నిలిపేస్తారు.
* ప్రొఫెషనల్‌ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. డిప్లొమా విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు. పీజీ కోర్సుల్లో.. ఎంబీఏ, ఎంసీఏ మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ పరిధిలోకి వస్తాయి.
* పీఎంఎస్‌ఎస్‌ పరిధిలోకిరాని కోర్సులు, విదేశాలు, దూరవిద్యా విధానంలో చదువుతున్నవారు, ఇతర స్కాలర్‌షిప్‌లను పొందినవారు ఈ స్కాలర్‌షిప్‌కు అనర్హులు.

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30, 2022
వెబ్‌సైట్‌:
http://www.ksb.gov.in/
ఈమెయిల్‌: jdpmssksb-mod@gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని