కరెంట్‌ అఫైర్స్‌

ఫెమినా మిస్‌ ఇండియా-2022 టైటిల్‌ విజేత?

Published : 29 Sep 2022 02:36 IST

మాదిరి ప్రశ్నలు

* ఫెమినా మిస్‌ ఇండియా-2022 టైటిల్‌ విజేత?  
జ:
సినీ సదానంద్‌ శెట్టి

* 2022లో ఏ రోజున భూమి తన చుట్టూ తాను తిరిగే సాధారణ సమయం కంటే (దాదాపు 24 గంటలు) 1.59 మిల్లీ సెకన్ల తక్కువ సమయంలోనే భ్రమణాన్ని పూర్తి చేసింది?
జ:
జులై 29

* ఏ రాష్ట్రంలో నిర్వహించే గర్భా నృత్య ప్రదర్శన ఎంట్రీ పాస్‌లపై 18 శాతం జీఎస్టీ విధించాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వివాదాస్పదమైంది?
జ:
గుజరాత్‌

 

* విద్యుత్తు కొనుగోళ్లలో 10 శాతం సౌరవిద్యుత్‌ కొనుగోలు లక్ష్యాలను అధిగమించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది?
జ:
నాలుగో స్థానం

* మంకీపాక్స్‌ బాధితులకు ఎన్ని రోజుల ఐసోలేషన్‌ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది?
జ:
21

* దేశంలో 2020లో జరిగిన మరణాలపై ఇటీవల రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధికంగా ఎంత శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో మరణించారు?
జ:
32.1 శాతం

నీ తెలంగాణలో ఎంత శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం 2022 ఆగస్టులో పార్లమెంటులో ప్రకటించింది?
జ:
99.4 శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని