స్మశానాల్లో మంటలు మండించే మూలకం!

వంట చేయడానికి, వాహనాలను నడపడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలు సహా నిత్య జీవితంలో అన్ని రకాల పనులకు శక్తి అవసరం. దాన్ని రకరకాల మార్గాల్లో ఉత్పత్తి చేస్తారు. శిలాజ ఇంధనాలతో పెట్రోలు, బొగ్గుతో విద్యుత్తు తయారవుతాయి.

Published : 08 May 2024 01:02 IST

టీఆర్‌టీ 2024 రసాయన శాస్త్రం

వంట చేయడానికి, వాహనాలను నడపడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలు సహా నిత్య జీవితంలో అన్ని రకాల పనులకు శక్తి అవసరం. దాన్ని రకరకాల మార్గాల్లో ఉత్పత్తి చేస్తారు. శిలాజ ఇంధనాలతో పెట్రోలు, బొగ్గుతో విద్యుత్తు తయారవుతాయి. ఇవి అంతరించిపోయే శక్తి వనరులు. పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కానీ వాటికి  ప్రత్యామ్నాయంగా సౌరశక్తి, పవనశక్తి, అణుశక్తి, జీవ ఇంధనాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇవి పునరుత్పాదక స్వభావం కలిగినవి, పర్యావరణానికి అనుకూలమైనవి. ఈ శక్తి వనరుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అవి ప్రగతిని ప్రభావితం చేస్తున్న తీరును అర్థం చేసుకోవాలి.

శక్తి వనరులు

1. కిందివాటిలో తరిగిపోయే శక్తి వనరును గుర్తించండి.

1) నేలబొగ్గు
2) పవనశక్తి
3) జలశక్తి
4) సౌరశక్తి

2. కిందివాటిలో తరగిపోని శక్తి వనరును గుర్తించండి.

1) సముద్ర అలల శక్తి
2) నేలబొగ్గు
3) పెట్రోలియం
4) సహజ వాయువు

3. నేలబొగ్గు ఉత్పన్నం కానిది?

1) కోక్‌
2) కోల్‌తార్‌
3) ప్యారాఫిన్‌ మైనం
4) కోల్‌గ్యాస్‌

4. కోక్‌కు సంబంధించిన సరైన ప్రవచనాన్ని గుర్తించండి.

ఎ) కోక్‌ను విద్యుత్‌ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
బి) కోక్‌ను లోహాల సంగ్రహాణకు కూడా ఉపయోగిస్తారు.
1) ఎ సరైంది   2) బి సరైంది
3) ఎ, బి రెండూ సరైనవి 4) ఎ సరైంది, బి సరికాదు

5. అత్యంత నాణ్యమైన కోక్‌?

1) ఫీట్‌
2) లిగ్నైట్‌
3) ఆంత్రసైట్‌
4) బిట్యుమినస్‌

6. అత్యంత నాసిరకమైన కోక్‌?

1) లిగ్నైట్‌
2) ఫీట్‌
3) బిట్యుమినస్‌
4) ఆంత్రసైట్‌

7. కిందివాటిని జతపరచండి.

1) 1020% ఎ) బిట్యుమినస్‌
2) 65%   బి) ఆంత్రసైట్‌
3) 98%   సి) లిగ్నైట్‌
4) 38%   డి) ఫీట్‌
1) 1-బి 2-సి 3-ఎ 4-డి
2) 1-బి 2-సి 3-డి 4-ఎ
3) 1-ఎ 2-బి 3-డి 4-సి
4) 1-సి 2-డి 3-బి 4-ఎ

8. నేలబొగ్గులో ప్రధానంగా ఉండే మూలకాన్ని గుర్తించండి.

1) హైడ్రోజన్‌
2) సల్ఫర్‌
3) ఫాస్ఫరస్‌
4) కార్బన్‌

9. నేలబొగ్గును మండిస్తే వెలువడే వాయువును గుర్తించండి.

1) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌
2) కార్బన్‌ డయాక్సైడ్‌
3) క్లోరిన్‌ వాయువు
4) నైట్రోజన్‌ డయాక్సైడ్‌

10. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేసినప్పుడు దుర్వాసన వచ్చే పదార్థం?

1) కోక్‌
2) కోల్‌గ్యాస్‌
3) కోల్‌తార్‌
4) బిటుమిన్‌

11. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేస్తే వెలువడే వాయు రూప పదార్థం?

1) కోల్‌గ్యాస్‌
2) ఆస్ఫాల్ట్‌
3) నాప్తలిన్‌
4) కోల్‌తార్‌

12. అమెరికా, లండన్‌లలో వీధిలైట్లు వెలిగించడానికి ఏ పదార్థాన్ని ఉపయోగించేవారు?

1) కోల్‌
2) బిటుమిన్‌
3) కోల్‌గ్యాస్‌
4) కోల్‌తార్‌

13. భారతదేశంలో తొలి చమురు బావిని ఏ రాష్ట్రంలో తవ్వారు?

1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) బిహార్‌
4) అస్సాం

14. పెట్రోలియం అనే పదాన్ని ఏ భాష నుంచి తీసుకున్నారు?

1) లాటిన్‌
2) గ్రీకు
3) ఇటాలియన్‌
4) అరబ్బీ

15. పెట్రోలియంను ఏ పద్ధతి ద్వారా ప్రస్తుతం శుద్ధి చేస్తున్నారు?

1) స్వేదనం
2) అంశ్విక స్వేదనం
3) భాష్పీభవనం
4) స్ఫటికీకరణం

16. హైడ్రోకార్బన్‌ల మిశ్రమం అని దేన్ని పిలుస్తారు?

1) నేలబొగ్గు
2) పెట్రోలియం
3) కోల్‌తార్‌
4) కోల్‌గ్యాస్‌

17. పెట్రోలియం ఘన పరిమాణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) గ్యాలన్‌
2) లీటర్లు
3) బ్యారల్‌
4) అడుగులు

18. నల్ల బంగారం అని దేన్ని పిలుస్తారు?

1) సహజ వాయువు
2) పెట్రోలియం
3) కోల్‌తార్‌
4) కోక్‌

19. వద్ద పెట్రోలియంను అంశ్విక స్వేదనం చేసినప్పుడు వెలువడే పదార్థం?

1) డీజిల్‌
2) కిరోసిన్‌
3) కందెనలు
4) పెట్రోల్‌

20. పెట్రోలియంను అంశ్విక స్వేదనం చేస్తే షూపాలిస్‌, గడియారాలు శుభ్రపరిచే ద్రవాలు ఏ ఉష్ణోగ్రత వద్ద వెలువడతాయి?

21. రోడ్లు వేసే తారు, పెయింట్స్‌లో ఉపయోగించే పెట్రోలియం ఉత్పన్న పదార్థం ఏది?

1) బిటుమిన్‌
2) లూబ్రికెంట్స్‌
3) కెమికల్స్‌
4) వాయు ఇంధనాలు

22. కిందివాటిలో ఫారాఫిన్‌ మైనం ఉప ఉత్పన్నాన్ని గుర్తించండి.

1) ఫేస్‌ క్రీమ్స్‌
2) టిష్యూ పేపర్స్‌
3) క్యాండిల్స్‌
4) పైవన్నీ

23. కిందివాటిలో కాలుష్యరహితమైన జీవ ఇంధనం?

1) పెట్రోల్‌
2) సీఎన్‌జీ
3) డీజిల్‌
4) బయోడీజిల్‌

24. పెట్రో కెమికల్స్‌ అంటే వేటి మిశ్రమ పదార్థం?

1) పెట్రోలియం + సహజ వాయువు
2) నేలబొగ్గు + సహజ వాయువు  
3) పెట్రోలియం + నేలబొగ్గు
4) బయోడీజిల్‌ + సహజ వాయువు

25. కృత్రిమ దారాలు, ప్లాస్టిక్‌లను వేటి ద్వారా తయారు చేస్తారు?

1) పెట్రోలియం
2) సహజ వాయువు
3) పెట్రోకెమికల్స్‌
4) బయోడీజిల్‌

26. అగ్గిపుల్ల తలలో ఉండే పెట్రోలియం ఉత్పన్నం?

1) లూబ్రికెంట్స్‌
2) బిటుమిన్‌
3) ఫారాఫిన్‌ మైనం
4) కోల్‌తార్‌

27. కిందివాటిలో శిలాజ ఇంధన వనరు?

1) నేలబొగ్గు
2) పెట్రోలియం
3) సహజవాయువు
4) పైవన్నీ

28. యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించే పెట్రోలియం ఉత్పన్నం?

1) బిటుమిన్‌
2) లూబ్రికెంట్స్‌
3) ఫారాఫిన్‌ మైనం
4) రసాయనాలు

29. భారతదేశంలో అధికంగా పెట్రోలియం సహజ వాయువు నిక్షేపాలు కింది ఏ ప్రాంతాల్లో ఉన్నాయని ఓఎన్‌జీసీ తెలిపింది?

1) అస్సాం
2) గుజరాత్‌
3) గంగానది పరీవాహక ప్రాంతం
4) పైవన్నీ

30. ఏ మొక్కకు సంబంధించిన తైలాలను రసాయన చర్యలకు గురిచేసి బయోడీజిల్‌ను తయారు చేస్తారు?

1) కానుగ
2) మిస్వాక్‌
3) జట్రోఫా
4) ఉత్తరేణి

31. దహన శీలి పదార్థాన్ని గుర్తించండి.

1) రాయి
2) నీరు
3) మట్టి
4) చెక్క

32. దహనశీలి కాని పదార్థాన్ని గుర్తించండి.

1) చెక్క
2) ప్లాస్టిక్‌
3) బొగ్గు
4) నీరు

33. పదార్థాలు మండటానికి ఉపయోగపడే దహన దోహదకారి?

1) నైట్రోజన్
2) హైడ్రోజన్‌
3) ఆక్సిజన్‌
4) క్లోరిన్‌

34. పదార్థాలు మండటానికి ఉపయోగపడని దహన దోహదకారి కానిది?

1) ఆక్సిజన్‌
2) హైడ్రోజన్‌
3) కార్బన్‌ డయాక్సైడ్‌
4) ఆర్గాన్‌

35. శీఘ్ర దహనం చెందే పదార్థాన్ని గుర్తించండి.

1) పెట్రోల్‌
2) నేలబొగ్గు
3) కర్రలు
4) పిడకలు

36. స్వతః సిద్ధ దహనం చెందే పదార్థాన్ని గుర్తించండి.

1) సల్ఫర్‌
2) అయోడిన్‌
3) కార్బన్‌
4) ఫాస్ఫరస్‌

37. నీటిలో నిల్వ ఉంచే పదార్థాన్ని గుర్తించండి.

1) సల్ఫర్‌
2) ఫాస్ఫరస్‌
3) అయోడిన్‌
4) సోడియం

38. మందకొడి దహనం చెందే పదార్థాన్ని గుర్తించండి.

1) పిడకలు
2) సీఎన్‌జీ
3్శ బయోడీజిల్‌
4) పెట్రోల్‌

39. వేసవి కాలంలో గడ్డివాములు, అడవుల్లో మంటలు ఏర్పడటానికి కారణమైన దహనం?

1) మందకొడి దహనం
2) శీఘ్ర దహనం
3) స్వతఃసిద్ధ దహనం
4) జ్వాలా దహనం

40. రాత్రి సమయంలో స్మశాన వాటికల్లో మంటలు ఏర్పడటానికి కారణమైన మూలకం?

1) సల్ఫర్‌
2) ఫాస్ఫరస్‌
3) అయోడిన్‌
4) కార్బన్‌

41. కిందివాటిలో సరైన ప్రవచనం?

ఎ) పదార్థాలు త్వరగా మండాలంటే వాటి జ్వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలి.
బి) మంటలను అదుపు చేయాలంటే పదార్థాల జ్వలన ఉష్ణోగ్రతలను పెంచాలి.
1) ఎ సరైంది 2) బి సరైంది
3) ఎ సరైంది, బి సరికాదు
4) ఎ, బిలు రెండూ సరైనవి

42. ఎన్ని కిలోగ్రామ్‌ల ద్రవ్యరాశి ఉన్న ఇంధనాన్ని పూర్తిగా దహించడం ద్వారా ఏర్పడిన ఉష్ణాన్ని కెలోరిఫిక్‌ ఉష్ణం అంటారు?

1) 1 కిలోగ్రామ్‌
2) 2 కిలోగ్రామ్‌లు
3) 3 కిలోగ్రామ్‌లు
4) 5 కిలోగ్రామ్‌లు

43. అత్యధిక కెలోరిఫిక్‌ ఉష్ణం ఉన్న ఇంధన పదార్థం?

1) బయోగ్యాస్‌
2) మీథేన్‌
3) పిడకలు
4) హైడ్రోజన్‌

44. కిందివాటిలో అతి తక్కువ కెలోరిఫిక్‌ ఉష్ణం ఉన్న ఇంధనం?

1) పెట్రోల్‌
2) డీజిల్‌
3) పిడకలు
4) బొగ్గు

45. కెలోరిఫిక్‌ ఉష్ణం ఎస్‌.ఐ. ప్రమాణం?

1) K J/gm
2) K cal/ kg 
3) Cal/kg
4) KJ/kg

46. కిందివాటిని జతపరచండి.

1) డీజిల్‌    ఎ) 6000-8000
2) హైడ్రోజన్‌ బి) 50,000
3) మీథేన్‌    సి) 45,000
4) పిడకలు   డి) 1,50,000
1) 1-డి 2-బి 3-ఎ 4-సి
2) 1-సి 2-బి 3-డి 4-ఎ
3) 1-సి 2-డి 3-ఎ 4-బి
4) 1-సి 2-డి 3-బి 4-ఎ

47. జ్వాలలో అత్యంత ఉష్ణ భాగం వద్ద మండే మంటలు ఏ రంగులో ఉంటాయి?

1) పసుపు
2) ఎరుపు
3) నీలి
4) నలుపు

48. జ్వాలలో మధ్యస్థ ఉష్ణభాగం వద్ద ఏర్పడే మంటలు ఏ రంగులో ఉంటాయి?

1) నలుపు
2) తెలుపు
3) ఆకుపచ్చ
4) ఎరుపు/పసుపు

49. అత్యల్ప ఉష్ణభాగం వద్ద జ్వాల ఏ రంగులో ఏర్పడుతుంది?

1) తెలుపు
2) పసుపు ఆవిరి
3) ఎరుపు
4) నీలి

50. కిందివాటిలో ఇంధనం కానిది?

1) బొగ్గు
2) పిడకలు  
3) కాగితం
4) కర్రలు

సమాధానాలు

1-1; 2-1; 3-3; 4-3; 5-3; 6-2; 7-2; 8-4; 9-2; 10-3; 11-1; 12-3; 13-4; 14-1; 15-2; 16-2; 17-3; 18-2; 19-4; 20-1; 21-1; 22-4; 23-4; 24-1; 25-3; 26-3; 27-4; 28-2; 29-4; 30-3; 31-4; 32-4; 33-3; 34-3; 35-1; 36-4; 37-2; 38-1; 39-3; 40-2; 41-4; 42-1; 43-4; 44-3; 45-4; 46-4; 47-3; 48-4; 49-2; 50-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని