కరెంట్‌ అఫైర్స్‌

భారత సైన్యం నూతన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?

Published : 06 Feb 2023 00:06 IST

మాదిరి ప్రశ్నలు

* భారత సైన్యం నూతన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ: లెఫ్టినెంట్‌ జనరల్‌ అరవింద్‌ వాలియా (2022, డిసెంబరు 31న పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్‌పాల్‌సింగ్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది)
* అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఏ నేత ఎన్నికయ్యారు? 

జ: కెవిన్‌ మెక్‌ కార్తీ

లండన్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ (సీఈబీఆర్‌) అంచనా ప్రకారం భారత్‌ ఏ సంవత్సరం నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ దేశంగా మారుతుంది? (సీఈబీఆర్‌ అంచనా ప్రకారం 2037 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది)  

జ: 2035

*ఎన్‌ఏఏసీ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) దేశంలోనే తొలిసారిగా ఏ విశ్వవిద్యాలయానికి ‘ఎ’ గ్రేడ్‌ ను ప్రకటించింది? (3.85 పాయింట్లు సాధించిన ఈ విశ్వవిద్యాలయం ‘ఎ’ గ్రేడ్‌ను సాధించింది)

జ: గురునానక్‌ దేవ్‌ యూనివర్సిటీ, అమృత్‌సర్‌

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తదుపరి చీఫ్‌ సైంటిస్ట్‌గా ఎవరు నియమితులయ్యారు?

జ: డాక్టర్‌ జెరేమీ ఫరార్‌

* ‘క్యూఎస్‌ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2023’ జాబితాలో భారత్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? (ఈ విద్యాసంస్థ జాబితా మొత్తం మీద 40వ స్థానంలో నిలిచింది)

జ: ఐఐటీ, బాంబే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని