కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచంలోనే మొదటి సారిగా మెలనిస్టిక్‌ టైగర్‌ సఫారీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది?

Published : 13 Mar 2024 00:07 IST

మాదిరి ప్రశ్నలు

  • ప్రపంచంలోనే మొదటి సారిగా మెలనిస్టిక్‌ టైగర్‌ సఫారీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది? (ఈ రాష్ట్రంలోని సిమ్లిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌కు సమీపంలోనే ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అత్యంత అరుదుగా కనిపించే మెలనిస్టిక్‌ పులులకు సంబంధించి మరింత మెరుగైన పరిశోధనలు చేయడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సఫారీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ బెంగాల్‌ పులులు అయిన ఈ నల్ల పులులు అధిక మెలనిన్‌ ఉత్పత్తి కారణంగా వాటి సాధారణ నారింజ, నలుపు రంగుకు బదులుగా నల్లటి ముదురు చారలతో కనిపిస్తాయి.)

జ: ఒడిశా

  • ఏ దేశం తొలిసారిగా తన సరిహద్దుల్లో కోల్టన్‌ నిక్షేపాలను కనుక్కున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది? (కోల్టన్‌ అనేది కొలంబైట్‌ - టాంటలైట్‌ల సంక్షిప్త రూపం. స్మార్ట్‌ ఫోన్‌లు, ఎలక్ట్రిక్‌ కార్‌ బ్యాటరీల లాంటి ఎలక్ట్రానిక్‌లను ఉత్పత్తి చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. నియోబియం, టాంటలమ్‌లతో కూడిన విలువైన ఖనిజమే కోల్టన్‌.)

జ: కెన్యా

  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఐటీజీఎన్‌ పూర్తి రూపం ఏమిటి? (ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన ఐఐటీజీఎన్‌ను దిల్లీ, ముంబయి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (డీఎమ్‌ఐసీ), గ్రేటర్‌ నోయిడా అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రూ.1700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఐఐటీజీఎన్‌ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు కంపెనీలకు ప్రోత్సాహకాలను అందిస్తుంది.)

జ: ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ - గ్రేటర్‌ నోయిడా

  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన కార్బన్‌ బోర్డర్‌ అడ్జస్ట్‌మెంట్‌ మెకానిజం (సీబీఏఎమ్‌) ఏ ప్రాంతానికి సంబంధించింది?

జ: యూరప్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని