APPSC Group II: ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్‌లో మార్పు.. కొత్త సిలబస్ ఇదే..!
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన సిలబస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
అమరావతి: ఏపీలో గ్రూప్-2 రాత పరీక్ష(Group II exam) లకు సంబంధించి కొత్త సిలబస్ విడుదలైంది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) అభ్యర్థులను ఎంపిక చేయనుంది. మొదటి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్.. ఆ తర్వాత రెండో దఫాలో 300 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు అర్హులవుతారు.
ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉండగా.. ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం.. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడగనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు