TS ICET: తెలంగాణ ఐసెట్‌ ఫలితాల విడుదల తేదీ ఖరారు

TS ICET Results: తెలంగాణలో ఐసెట్‌ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ పి.వరలక్ష్మి తెలిపారు.

Updated : 28 Jun 2023 18:50 IST

హనుమకొండ: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐ-సెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. మే 26, 27 తేదీల్లో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ (TS ICET) పరీక్ష ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ పి.వరలక్ష్మి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70వేల మందికి పైగా విద్యార్థులు ఐసెట్‌ పరీక్ష రాశారు. ఫలితాలను www.eenadu.net, https://icet.tsche.ac.in/లో తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు