ఉప్పు ఒత్తిడి!
వంటకాలకు ఉప్పు రుచిని తెచ్చిపెడుతుంది. కానీ ఎక్కువగా వాడితే వంటనే చెడగొడుతుంది. కషాయంగా మార్చేస్తుంది. ఆరోగ్యం విషయంలోనూ అంతే. ఉప్పు వాడకం మితిమీరితే అధిక రక్తపోటు, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు.. ఇది మానసిక ఒత్తిడికీ దారితీస్తుందంటే నమ్ముతారా? కార్డియోవ్యాస్కులర్ రీసెర్చ్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఇదే చెబుతోంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఒత్తిడికి కారణమయ్యే హర్మోన్ మోతాదు 75% మేరకు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరో పరిశోధకులు గుర్తించారు మరి. మామూలుగా ఎలుకలు ఉప్పులేని లేదా అతి తక్కువ ఉప్పు గల పదార్థాలు తింటుంటాయి. వీటికి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వగా ఒత్తిడి హార్మోన్ మోతాదులు గణనీయంగా పెరిగాయి. ఒత్తిడికి హార్మోన్ ప్రతిస్పందన సైతం రెట్టింపు కావటం విశేషం. ఒత్తిడికి శరీరం స్పందించే తీరును మెదడులోని ప్రొటీన్లు నియంత్రిస్తుంటాయి. ఉప్పు ఎక్కువగా తిన్నప్పుడు ఈ ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువుల పనితీరూ పుంజుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆందోళన, కోపం వంటి ప్రవర్తన మార్పులకూ అధిక ఉప్పు దారితీస్తుందేమో తెలుసుకోవాలనీ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా ఉప్పు తక్కువగా తినటం ఎంతైనా మంచిది. ఇది శరీరానికే కాదు, మనసుకూ మేలు చేస్తుంది. ఉప్పు వాడకాన్ని పెద్దవాళ్లు రోజుకు 5 గ్రాముల కన్నా మించకుండా (ఒక చెంచా లోపు) చూసుకోవాలనేది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. కూరల్లో వేసుకునేదే కాదు.. పచ్చళ్లు, చిరుతిళ్ల వంటి వాటిలోని ఉప్పూ ఇందులోని భాగమే. కానీ మనలో చాలామంది రోజుకు 9 గ్రాముల కన్నా ఎక్కువగానే ఉప్పు తింటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరవటం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భూ పరిహారం నొక్కేసిన వైకాపా నేత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Andhra News: ఇంటర్ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు.. భౌతికశాస్త్రం ప్రశ్నకు 2 మార్కులు
-
India News
Supreme Court: లోక్సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి