కునుకుతో నిద్ర భర్తీ?

పెద్దవాళ్లకు రాత్రిపూట రోజుకు 7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర తగ్గితే మెదడు, శరీరం కోలుకోవటం కష్టమవుతుంది. అలసట, నీరసం తలెత్తుతాయి.

Published : 24 Jan 2023 00:07 IST

పెద్దవాళ్లకు రాత్రిపూట రోజుకు 7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర తగ్గితే మెదడు, శరీరం కోలుకోవటం కష్టమవుతుంది. అలసట, నీరసం తలెత్తుతాయి. హుషారు, ఉత్సాహం తగ్గుతాయి. ఏకాగ్రత కొరవడుతుంది. పోషక విలువలు లేని జంక్‌ఫుడ్‌, చిరుతిళ్లు తినాలనే కోరికా ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్ర తగ్గినప్పుడు పగటిపూట అరగంట సేపు కునుకు తీస్తే కొంతవరకు ఉపయోగపడొచ్చు. అంతకన్నా ఎక్కువసేపు పడుకుంటే నిద్రమత్తు ఆవహిస్తుంది. అయితే పగటి కునుకుతో రాత్రి నిద్ర భర్తీ కాదనే విషయాన్ని గుర్తించాలి. మర్నాడు కాస్త ముందుగానే రాత్రి నిద్రకు ఉపక్రమిస్తే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని