కమ్మటి నిద్రతో ఆయుష్షు!

దీర్ఘాయుష్షుతో, మంచి ఆరోగ్యంతో జీవించాలని అనుకుంటున్నారా? అయితే కంటి నిండా కమ్మగా నిద్ర పోయేలా చూసుకోండి.

Published : 07 Mar 2023 00:23 IST

దీర్ఘాయుష్షుతో, మంచి ఆరోగ్యంతో జీవించాలని అనుకుంటున్నారా? అయితే కంటి నిండా కమ్మగా నిద్ర పోయేలా చూసుకోండి. గాఢమైన నిద్ర గుండెకు.. మొత్తంగా ఆరోగ్యానికి మేలు చేస్తున్నట్టు, ఇది చివరికి ఎక్కువ కాలం జీవించటానికి తోడ్పడు తున్నట్టు అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ వార్షిక సదస్సుకు సమర్పించిన పత్రం పేర్కొంటోంది. చిన్నవయసులో మంచి నిద్ర అలవాట్లు గలవారికి అకాల మరణం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు ఇది చెబుతోంది. ఏ కారణంతోనైనా సంభవించే మరణాల్లో 8% వరకు సరిగా నిద్రపోక పోవటంతోనే ముడిపడి ఉంటుండటం గమనార్హం. మంచి ఆరోగ్యానికి తగినంత నిద్రపోయేలా చూసుకుంటే చాలనే విషయాన్ని ఈ అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని