పెంపుడు జ్ఞాపకం!

ఒంటరిగా నివసించే వృద్ధులకు పెంపుడు జంతువులు మేలు చేస్తున్నట్టు, ఇవి విషయగ్రహణ సామర్థ్యం త్వరగా తగ్గకుండా కాపాడుతున్నట్టు జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.

Updated : 09 Jan 2024 04:27 IST

ఒంటరిగా నివసించే వృద్ధులకు పెంపుడు జంతువులు మేలు చేస్తున్నట్టు, ఇవి విషయగ్రహణ సామర్థ్యం త్వరగా తగ్గకుండా కాపాడుతున్నట్టు జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. సగటున 66 ఏళ్ల వయసుగల సుమారు 8వేల మందిని పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. వయసు మీరుతున్న కొద్దీ విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతూ వస్తుంటుంది. దీంతో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి.   65 ఏళ్లు పైబడ్డవారిలో సుమారు 10-20% మందిలో స్వల్పంగా విషయగ్రహణ తగ్గుతున్నట్టు అంచనా.ఇది డిమెన్షియాకు ముందస్తు సూచన. ఇలాంటివారిపై పెంపుడు జంతువుల ప్రభావాన్ని గుర్తించటానికి పరిశోధకులు ప్రయత్నించారు. పూర్తిగా ఒంటరిగా జీవించే వృద్ధులతో పోలిస్తే పెంపుడు జంతువులు గల ఒంటరి వృద్ధుల్లో విషయగ్రహణ సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతున్నట్టు గుర్తించారు. అయితే ఇతరులతో కలిసి జీవించే వృద్ధులతో పోలిస్తే మాత్రం వీరిలో పెద్ద తేడా ఏమీ లేకపోవటం గమనార్హం. కార్య నిర్వహణ, కార్య కారణ వివేచన, ఏకాగ్రత వంటి వాటిని పరిశీలించక పోవటం వల్ల తమ అధ్యయనానికి కొన్ని పరిమితులు లేకపోలేదని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని