రొమ్ముక్యాన్సర్‌ మరణాలు తగ్గుముఖం

రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లను ముందుగానే గుర్తించటం, ఒకవేళ క్యాన్సర్‌ బారినపడితే సత్వరం తగు చికిత్స తీసుకోవటం చాలా ముఖ్యం. దీంతో మరణాలను తగ్గించుకోవచ్చు. స్టాన్‌ఫోర్డ్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనం ఇదే సూచిస్తోంది

Published : 23 Jan 2024 00:54 IST

రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లను ముందుగానే గుర్తించటం, ఒకవేళ క్యాన్సర్‌ బారినపడితే సత్వరం తగు చికిత్స తీసుకోవటం చాలా ముఖ్యం. దీంతో మరణాలను తగ్గించుకోవచ్చు. స్టాన్‌ఫోర్డ్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనం ఇదే సూచిస్తోంది. మామోగ్రామ్‌ పరీక్ష, మెరుగైన చికిత్సలతో 1975-2019 మధ్య కాలంలో రొమ్ముక్యాన్సర్‌ మరణాలు 58% తగ్గినట్టు తేలింది. రొమ్ముక్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపిస్తే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి క్యాన్సర్‌ విషయంలోనూ మెరుగైన చికిత్సల మూలంగా 29% మరణాలు తగ్గుముఖం పట్టటం విశేషం. ఇతర భాగాలకు వ్యాపించిన క్యాన్సర్‌ నయం కాదని పరిగణించినప్పటికీ దీని బారినపడ్డ మహిళలూ ఇప్పుడు ఎక్కువ కాలం జీవిస్తుండటం గమనార్హం. రొమ్ముక్యాన్సర్‌ విషయంలో మున్ముందు ఏయే విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరముందో తెలుసుకోవటానికి అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని