పిక్కలు పట్టేస్తుంటే..

కొన్నిసార్లు మంచి నిద్రలో ఉండగా పిక్కలు పటేస్తుంటాయి. భరించలేనంత నొప్పితో విలవిల్లాడుతుంటాం. ఇలాంటప్పుడు కాలును సాగదీసి, కాసేపు అలాగే ఉంచితే ఉపశమనం కలుగుతుంది

Published : 09 Apr 2024 00:03 IST

కొన్నిసార్లు మంచి నిద్రలో ఉండగా పిక్కలు పటేస్తుంటాయి. భరించలేనంత నొప్పితో విలవిల్లాడుతుంటాం. ఇలాంటప్పుడు కాలును సాగదీసి, కాసేపు అలాగే ఉంచితే ఉపశమనం కలుగుతుంది. మంచం మీది నుంచి లేచి నెమ్మదిగా కాలు మీద భారం మోపి ఉంచినా కాసేపట్లో సర్దుకుంటుంది. వీలుంటే మంచు ముక్కలతో అద్దినా మేలే. అయితే శాశ్వత పరిష్కారం కావాలంటే కారణమేంటో తెలుసుకోవటం తప్పనిసరి. మధుమేహం, కిడ్నీ, కాలేయ జబ్బులేవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒంట్లో ఖనిజ లవణాల మోతాదులూ పరీక్షించుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం వంటివి తగ్గినా పిక్కలు పట్టేయొచ్చు. విటమిన్‌ డి లోపమూ కారణం కావొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని