Vomiting: ప్రయాణంలో వాంతెందుకు!
కొందరికి బస్సు ఎక్కాలంటేనే భయం. ప్రయాణిస్తున్నప్పుడు వాంతులవుతుంటాయి. వికారం, తల తిప్పటమూ ఉండొచ్చు.
కొందరికి బస్సు ఎక్కాలంటేనే భయం. ప్రయాణిస్తున్నప్పుడు వాంతులవుతుంటాయి. వికారం, తల తిప్పటమూ ఉండొచ్చు. బస్సు ఒక్కటే కాదు.. కారు, రైలు, విమానం దేనిలో ప్రయాణిస్తున్నా ఇవి వేధిస్తుంటాయి. దీన్ని మోషన్ సిక్‌నెస్, కైనెటోసిస్ అంటారు. దీనికి కారణమేంటో తెలుసా? కళ్ల నుంచి, లోపలి చెవి నుంచి మెదడుకు అందే సమాచారం మధ్య తేడా ఉండటమే. కాళ్లు, చేతుల నుంచి వచ్చే సంకేతాలతో మనం కదులుతున్నామా? లేదా? అనేది మెదడు తెలుసుకుంటుంది. మరోవైపు లోపలి చెవిలోని ‘ఎండోలింఫు’ అనే ద్రవం మనం కదులుతున్న విషయాన్ని గ్రహించి, మెదడుకు చేరవేస్తుంటుంది. ఒకవేళ మనం ప్రయాణిస్తున్నా కదలటం లేదని కళ్ల నుంచి సమాచారం అందితే మెదడు తికమకపడుతుంది. దీంతో వాంతి, వికారం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఆందోళన, ఒత్తిడి, నిస్సత్తువతో ఇవి మరింత తీవ్రమవుతాయి. ఆయా వ్యక్తులు, వాహనాల రకాలను బట్టి వీటి తీవ్రత, సమయం ఆధారపడి ఉంటుంది. మరి ప్రయాణాల్లో వాంతి, వికారాలను తగ్గించుకోవటమెలా? ఇందుకు కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి.
* కారులో లేదా బస్సులో ముందు సీట్లో కూర్చోవటం మంచిది. ముందు వైపునకు చూసేలా కూర్చోవాలి. ఒకే దూరంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది చెవులు, కళ్ల నుంచి మెదడుకు అందే సమాచారంలో తేడా తగ్గటానికి తోడ్పడుతుంది.
* విమానాల్లో, రైళ్లలో కిటికీ పక్క సీటులో కూర్చోవాలి.
* వీలైతే కళ్లు మూసుకోవాలి లేదా పడుకోవాలి.
* మద్యం, కెఫీన్‌తో కూడిన పానీయాలు తాగొద్దు.
* దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి.
* సిగరెట్ల వంటివి కాల్చొద్దు.
* సొంత వాహనమైతే తరచూ కాసేపు ఆపేలా చూసుకోవాలి.
* శ్రావ్యమైన, ఇష్టమైన సంగీతాన్ని వినాలి.
* రుచికరమైన బిళ్లలు చప్పరించొచ్చు. అల్లం రుచితో కూడిన బిళ్లలైతే వికారాన్ని తగ్గిస్తాయి.
* డాక్టర్ సలహా మేరకు ప్రయాణానికి గంట ముందు వాంతి తగ్గించే మాత్రలు వేసుకోవాలి.
* దీనికి ఆక్యుప్రెషర్ చిట్కాలూ ఉపయోగపడొచ్చు. మణికట్టు వద్ద బొటన వేలు దిగువన ఉండే పీ-6 (నీ గువాన్) కేంద్రం మీద అదిమి పడితే ఉపశమనం కలగొచ్చు. ఇందుకోసం ఆక్యుప్రెషర్ పట్టీలు (సీ బ్యాండ్స్) కూడా ఉన్నాయి. ఇవి ఒత్తిడిని కలగజేసి వికారం తగ్గిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అశ్విన్ తుది జట్టులో ఉంటాడా... లేదా? ఆస్ట్రేలియా శిబిరంలో ఇదే హాట్ టాపిక్!
-
World News
Putin: చర్చితో సంబంధాలు బలపర్చుకొనే యత్నాల్లో పుతిన్..!
-
Crime News
Hyderabad: కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. రెండేళ్ల చిన్నారి మృతి
-
Movies News
Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్ సర్
-
General News
Amaravati: లింగమనేని రమేశ్ నివాసం జప్తు పిటిషన్‌పై ఈనెల 6న తీర్పు
-
India News
బ్రిజ్‌భూషణ్‌కు యూపీ షాకిచ్చిందా..?వాయిదా పడిన ఎంపీ ర్యాలీ