జ్ఞాపకశక్తి అమోఘం!

ఇరవై నెలల బాబు.. అబ్బురపరుస్తున్నాడు.. ఒకటో రెండో కాదు.. 270 వస్తువులను గుర్తిస్తున్నాడు.. సూపర్‌, వండర్‌ కిడ్‌గా పిలిపించుకుంటున్నాడు.. ఆ చిన్నారి వివరాలు ఇవిగో..

Updated : 20 Sep 2020 01:42 IST

ఇరవై నెలల బాబు.. అబ్బురపరుస్తున్నాడు.. ఒకటో రెండో కాదు.. 270 వస్తువులను గుర్తిస్తున్నాడు.. సూపర్‌, వండర్‌ కిడ్‌గా పిలిపించుకుంటున్నాడు.. ఆ చిన్నారి వివరాలు ఇవిగో..

ముద్దు ముద్దు మాటలతో మైమరపించే ఆదిత్‌ విశ్వనాథ్‌ వయసు 20 నెలలు. కరీంనగర్‌కు చెందిన ఈ చిన్నారి.. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు 270 వస్తువులను గుర్తిస్తూ అబ్బురపరుస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో తాతయ్య, నానమ్మ గౌరిశెట్టి మునీందర్‌-అనూరాధ మనవడిలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఒకసారి చెబితే చాలు..

వివిధ కార్ల లోగోలు, దేశాల జెండాలు, ఖండాలు, వాహనాలు, వృత్తి పరమైన పరికరాలు, రంగులు, పక్షులు, జంతువుల ధ్వనులు, ఆకారాలు.. ఇలా 17 విభాగాలకు చెందిన 270 వస్తువులు ఆదిత్‌కు తెలుసు. చిన్నారి ప్రతిభను లండన్‌కు చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించాయి. బంగారు పతకంతో పాటు సూపర్‌ కిడ్‌, వండర్‌ కిడ్‌ పురస్కారాలు అందించాయి. ఏ విషయాన్నైనా ఒకసారి వివరిస్తే చాలు.. గుర్తుంచుకొని మళ్లీ ఎప్పుడు అడిగినా టక్కున చెబుతున్నాడని తల్లిదండ్రులు అరుణ్‌ సాయి-స్నేహిత వివరించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని