ఈ యాపిల్ ఆరోగ్యానికి హానికరం!
‘యాపిల్ మంచిదే కదా.. పైగా పిల్లలమైన మాకు ఎంతో ఇష్టం. మరి.. హానికరం అంటున్నారేంటి?’ అని ఆలోచిస్తున్నారు కదూ ఫ్రెండ్స్..! అంటే ఇది మనం తినే యాపిల్ గురించి కాదనుకోండి. ‘మరి ఇంకేం యాపిల్ అబ్బా?’ అని మరోసారి ఆలోచిస్తున్నారు కదా! ఎందుకంత కష్టం? ఎంచక్కా ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.
ఈ చెట్టు పేరు మంచినీల్. ‘యాపిల్ అన్నారు. ఆరోగ్యానికి హానికరం అన్నారు. ఇప్పుడేంటి మంచినీల్ అని.. చెట్టు అని ఏదేదో చెబుతున్నారు’ అని అనుకోకండి. ఆ ప్రమాదకరమైన యాపిల్ ఈ చెట్టుకే కాస్తుంది. ఆ యాపిల్‌ను బీచ్ యాపిల్ అని, మంచినీల్ ఫ్రూట్ అనీ పిలుస్తారు.
నిలువెల్లా విషమే
ఈ మంచినీల్ చెట్టు పేరులోనే మంచి ఉంటుంది! కానీ తీరులో మాత్రం నిలువెల్లా విషమే. ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన చెట్లలో ఇదీ ఒకటి. ఈ చెట్లు ఎక్కువగా కరీబియన్ దీవులు, అమెరికాలోని ఫ్లోరిడా, మెక్సికో తీరాల్లో ఉంటాయి.
అచ్చం అలానే...
ఈ మంచినీల్ చెట్టు పండ్లు అచ్చుగుద్దినట్లు యాపిల్ పండ్లలా ఉండవు కానీ, ఆకులు మాత్రం యాపిల్ చెట్టు ఆకుల్లానే ఉంటాయి. ఈ చెట్లు 15 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.
గాలి సోకినా.. గడబిడే!
ఈ చెట్టు బెరడు, కాండం, కొమ్మలు, పండ్లు, ఆకులు, చిగుళ్లు.. ఇలా ప్రతి భాగమూ విషపూరితమే. పాలలాంటి ద్రవం చెట్టంతా విస్తరించి ఉంటుంది. వర్షం చినుకు ఈ చెట్టుపై నుంచి మన ఒంటి మీద పడ్డా చాలు చర్మానికి బొబ్బలు వస్తాయి. ఎక్కువ సమయం ఈ చెట్టు కింద ఉండటమూ ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఈ పండ్లు తింటేనా... ఇక అంతే సంగతులు. ఈ చెట్టును కాల్చగా వచ్చిన పొగ కూడా విషపూరితమే. అందుకే ఈ చెట్ల మీద కనీసం పక్షులు కూడా వాలవు.
ఉపయోగాలూ ఉన్నాయి.
ఈ చెట్లు ఇంత విషపూరితం అయినప్పటికీ వీటి వల్ల ప్రకృతికి కాస్త ఉపయోగమూ ఉంది. ఈ చెట్లు ఎక్కువగా మడ అడవుల్లో అంతర్భాగంగా పెరుగుతాయి. సముద్రతీరాన్ని కోతకు గురి కాకుండా కాపాడతాయి. అనుభవజ్ఞులైన పనివారు చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చెట్ల నుంచి సేకరించిన కలపతో ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. బెరడు నుంచి సేకరించిన గమ్‌ను ఎడెమా అనే వ్యాధి చికిత్సలో వాడతారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మంచినీల్ చెట్టు సంగతులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని