వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు

భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Updated : 10 May 2024 12:50 IST

పెందుర్తి: భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.  వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూపంలోకి తీసుకొచ్చారు. 

ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత వేకువజామున 2.30 గంటల నుంచి సాధారణ భక్తులకు అవకాశం కల్పించారు. అప్పన్న స్వామి నిజరూప దర్శనం చేసుకుంటే సకల శుభాలూ కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేకువజాము నుంచే సింహగిరిపై భక్తులు బారులు తీరారు. గోవింద నామాలతో సింహాచల పుణ్యక్షేత్రం మారుమోగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని