అజః

విష్ణుసహస్రనామావళిలో 95వది. ‘అజః’ అనేది విశేష శబ్దం. దీనికి నిఘంటు పరంగా ఆత్మ, బ్రహ్మ, శివుడు, విష్ణువు అనే అర్థాలు ఉన్నాయి.

Updated : 18 Apr 2024 00:20 IST

విష్ణుసహస్రనామావళిలో 95వది. ‘అజః’ అనేది విశేష శబ్దం. దీనికి నిఘంటు పరంగా ఆత్మ, బ్రహ్మ, శివుడు, విష్ణువు అనే అర్థాలు ఉన్నాయి. ఆత్మ ఎలా అయితే అన్నిటికీ అతీతమో అజుడు కూడా అలానే అన్నిటికీ అతీతుడని గ్రహించాలి. ఈ పదానికి- జన్మలు లేనివాడు, అన్ని అడ్డంకులనూ తొలగించే వాడు, భక్తుల హృదయాల్లో సంచరిస్తుండేవాడు.. అనే అర్థాలూ ఉన్నాయి. అన్ని శబ్దాలకూ మూలమైనవాడు శబ్దబ్రహ్మ - అనే విశేషార్థమూ ఉంది. అంటే సర్వ సృష్టికర్త, సర్వవ్యాపకుడు కనుక ఆ స్వామికి ఈ నామం సరిగ్గా సరిపోతుంది అని చెప్పవచ్చు.                         

 - వై.తన్వి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని