ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధాలు అష్టవిధ బంధాలు

ఆధ్యాత్మిక సాధనకు.. దేహం మీద మోహం, బంధుప్రీతి, కీర్తి ప్రతిష్ఠలపై ఆరాటం, ఇంకా ఇంకా కావాలనే అంతులేని ఆశ, ఓర్వలేనితనం, ఏదో లేదనే దిగులు, ద్వేషంతో వైరం తెచ్చుకోవటం, సంసారజంజాటం- అనే ఎనిమిది రకాల బంధాలు అడ్డుపడతాయని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.

Published : 16 May 2024 00:01 IST

ఆధ్యాత్మిక సాధనకు.. దేహం మీద మోహం, బంధుప్రీతి, కీర్తి ప్రతిష్ఠలపై ఆరాటం, ఇంకా ఇంకా కావాలనే అంతులేని ఆశ, ఓర్వలేనితనం, ఏదో లేదనే దిగులు, ద్వేషంతో వైరం తెచ్చుకోవటం, సంసారజంజాటం- అనే ఎనిమిది రకాల బంధాలు అడ్డుపడతాయని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. వీటినే ‘అష్టపాశాలు’ అంటారు. మోక్షసాధనలోనూ అవి ప్రతిబంధకమేనని మహర్షులు స్పష్టంచేశారు.

రామకృష్ణ పరమహంస వీటిని అష్టవిధ బంధాలు అనేవారు. ‘దేహభ్రాంతి వల్ల ఆత్మను తెలుసుకునే దిశగా ప్రయాణించలేరు. బంధుప్రీతితో స్వార్థపూరితులై అధర్మ మార్గంలో పయనించటానికి వెనుకాడరు. కీర్తిప్రతిష్ఠల వ్యామోహంతో వాటిని ఆర్జించి, గర్విస్తారు. వివేకం మర్చిపోతారు. ఇతరులను చూసి ఓర్వలేని మాత్సర్య గుణంతో సంకుచిత స్వభావులుగా మారతారు. లౌకిక వ్యామోహాలతో బందీలవుతారు. లేనిదాని కోసం చింతతో నిరాశలో కూరుకుపోతారు. అసూయ ద్వేషానికి దారి తీస్తుంది. నిరంతరం సంసార తాపత్రయంతో పేడకుప్పలో ఉండే పురుగులా పరిణమిస్తారు. సద్గురువును ఆశ్రయించి, ఆధ్యాత్మిక సాధకులుగా మారదలచుకున్నప్పుడు.. ఈ అష్టపాశాల నుంచి విముక్తమవ్వాలి’ అంటూ ప్రబోధించారు.                    

ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని