శివతాండవమంటే?

యావత్‌ విశ్వానికి లయకారకుడు పరమేశ్వరుడు. శివ అంటే సంతోషం లేదా శుభకరం. ఓం, శివ అనే పదాలకు అర్థం ఒకటే. మాండుక్య ఉపనిషత్‌లో శాంతమ్..

Updated : 14 Mar 2023 15:59 IST

యావత్‌ విశ్వానికి లయకారకుడు పరమేశ్వరుడు. శివ అంటే సంతోషం లేదా శుభకరం. ఓం, శివ అనే పదాలకు అర్థం ఒకటే. మాండుక్య ఉపనిషత్‌లో శాంతమ్‌ శివమ్‌ అద్వైతం అని ఉంది.  దేశంలో శివారాధన వేల సంవత్సరాలుగా పరంపరగా కొనసాగుతోంది. శివుడిని లింగ రూపంలో ఎక్కువగా చూస్తుంటాం. శైవ సంప్రదాయంలో శివునికి 25 కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయని తెలుస్తోంది.

నటరాజ

పరమేశ్వరుడు ఎర్రటి శిరోజాలతో హిమాద్రిపై  చేసే నృత్యమే శివతాండవం. శివుని డమరుకం నుంచి వెలువడ్డ శబ్దాలే భాషగా మారిందంటుంది సనాతనధర్మం. శివతాండవంలో ఉదయించే సూర్యుడు, సముద్రపు ఘోష, గ్రహాల భ్రమణం, ప్రళయకాల ఉరుములు, మెరుపుల ధ్వనులుంటాయి. ఆయనకున్న నాలుగు చేతులు నాలుగు దిక్కులను సూచిస్తాయి. భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుని చేతులలో ఒక దానిలో డమరుకం ఉంటుంది. దీని ద్వారా నాదం వెలువడుతుంది. అందుకే తత్వశాస్త్రంలో ఉమాపతిని నాద బ్రాహ్మణ అంటారు. మరో చేయి అర్ధచంద్రముద్రలో కనిపిస్తూ జ్వలించే అగ్నిని కలిగివుంటుంది.  అగ్ని అన్నింటిని దహించివేస్తుంది.  మరో చేయి అభయముద్రలో ఉంటుంది. సమస్త ప్రాణికోటికి అభయాన్నిస్తుంది.  మరో చేయి స్వామి పాదాలను సూచిస్తుంది. ఆయన చరణాలను నమ్ముకుంటే చాలు రక్షణ లభిస్తుంది.

ఆ నృత్యంతోనే రక్షణ

శివతాండవం లోక సంక్షేమాన్ని కోరి చేసే నాట్యం. కాల్పనిక మాయలో ఉన్న మన జీవితాలను విముక్తి చేస్తుంది. ఆ నృత్యంతో అంధకారంతోపాటు లోక కంటక శక్తులు నశిస్తాయి. ప్రాణులు జ్ఞానశుద్ధి సాధించాలంటే చుట్టూ ఉన్న అజ్ఞానం నశించాలి. అందుకే ఆ పరమేశ్వరుని తాండవంతో చీకట్లు తొలగిపోతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని