ఐక్యూబ్‌ అదనపు మెరుగులతో

రోజు రోజుకీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. వాటితోపాటే బ్యాటరీ బండ్ల కొనుగోళ్లూ పోటెత్తుతున్నాయి.

Published : 18 May 2024 01:27 IST

రోజు రోజుకీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. వాటితోపాటే బ్యాటరీ బండ్ల కొనుగోళ్లూ పోటెత్తుతున్నాయి. ఇందులో మహరాజపోషకులు యువతే. వారిని దృష్టిలో పెట్టుకొని టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి మరిన్ని తళుకులద్ది ఇలా విపణిలోకి తీసుకొచ్చింది. 

  •  ఇది ఐక్యూబ్, ఐక్యూబ్‌ ఎస్, ఐక్యూబ్‌ ఎస్‌టీ అనే మూడు వెర్షన్లు, ఐదు రకాల్లో లభిస్తోంది. ధర రూ.94,999 (ప్రారంభం)
  •  రెండు గంటల్లోనే 80శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. గంటకు 75 కిలోమీటర్ల అత్యధికం వేగం దీని సొంతం.
  • ఐదు అంగుళాల టీఎఫ్‌టీ తెర (టాప్‌ వేరియంట్‌లో 7 అంగుళాల తెర), నావిగేషన్, వెహికిల్‌ క్రాష్‌ అలర్ట్, 30లీటర్ల అండర్‌సీటు స్టోరేజీ కొన్ని ఫీచర్లు.
  • ఐక్యూబ్‌ ఎస్‌టీ 5.1కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ విభాగంలో అతిపెద్ద బ్యాటరీ ఉన్న వాహనం ఇదే.
  • కాపర్‌ బ్రాంజ్‌ మ్యాటే, కోరల్‌ శాండ్‌ శాటిన్, టైటానియమ్‌ గ్రే మ్యాట్, స్టార్‌లైట్‌ బ్లూ రంగుల్లో లభ్యమవుతోంది. 
  • ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని