నువ్వేమైనా గజినీవా..

మా మ్యాథ్స్‌ లెక్చరర్‌ అంటే తరగతిలో అందరికీ చెప్పలేనంత ఇష్టం. ఆయన సబ్జెక్టుని అరటి పండు ఒలిచి, నోట్లో పెట్టినంత తేలిగ్గా చెప్పేవారు. ఓసారి ఆయన ‘విజయ్‌.. నీ జుత్తు మరీ పొడుగ్గా ఉందిరోయ్‌.

Published : 08 Jun 2024 01:01 IST

కాలేజీ కహానీ 

మా మ్యాథ్స్‌ లెక్చరర్‌ అంటే తరగతిలో అందరికీ చెప్పలేనంత ఇష్టం. ఆయన సబ్జెక్టుని అరటి పండు ఒలిచి, నోట్లో పెట్టినంత తేలిగ్గా చెప్పేవారు. ఓసారి ఆయన ‘విజయ్‌.. నీ జుత్తు మరీ పొడుగ్గా ఉందిరోయ్‌. దేశదిమ్మరిలా ఉన్నావ్‌. రేపు కత్తిరించుకొని వచ్చెయ్‌’ అన్నారు. నాలో నాకు బాగా నచ్చేది ఆ జుత్తే. అది చూసే మా క్లాసులో నన్ను ఒకమ్మాయి ఇష్టపడుతోంది అని నా నమ్మకం. అంతటి ఇష్టమైన హెయిర్‌ని కత్తిరించుకోవడం నావల్ల కాలేదు. సర్‌ చెప్పిన మాట వినలేదు. మరో నాలుగైదు రోజులయ్యాక సీరియస్‌గా ‘ఏంట్రా.. నువ్వేమైనా గజినీవా.. నేను చెప్పింది మర్చిపోయావా?’ అన్నారు. నాకేం చెప్పాలో తెలీక ‘నేను ఈనెలలోనే పుట్టాను సర్‌.. సెంటిమెంట్‌ ప్రకారం జుత్తు కత్తిరించుకోకూడదు’ అంటూ అబద్ధమాడేశా. దాంతో నా క్లాస్‌మేట్సంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత నెలలోనే పరీక్షలు రావడం.. ఆపై వేసవి సెలవులు కావడంతో నాకిష్టమైన జుత్తును కత్తిరించుకోకుండా తప్పించుకోగలిగా.

ఆర్‌.విజయ్, కర్నూలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని