విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని లోకేశ్‌ లేఖ

విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని... విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో కరోనా మూడో దశ ఉద్ధృతమవుతోంది. పది రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. 15 ఏళ్లలోపు పిల్లలకు ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. ఈ సమయంలో పాఠశాలల నడిపితే ముప్పు కలిగే అవకాశముంది. ఇప్పటికే అనేక...

Published : 18 Jan 2022 04:52 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని... విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో కరోనా మూడో దశ ఉద్ధృతమవుతోంది. పది రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. 15 ఏళ్లలోపు పిల్లలకు ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. ఈ సమయంలో పాఠశాలల నడిపితే ముప్పు కలిగే అవకాశముంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశాయి’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని