
Published : 08 Dec 2021 04:33 IST
పొలంలోకి మొసలి
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని మరళి గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పంట పొలంలో మంగళవారం మొసలి కలకలం రేపింది. వరి పంటను యంత్రంతో కోస్తున్న సమయంలో పొలం నుంచి బయటకు వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. దానిని చూసిన పశువుల కాపరులు రాళ్లతో కొడుతూ నది వైపునకు తరిమారు.
- న్యూస్‌టుడే, కౌతాళం
Tags :