Bajaj Chetak: బజాజ్‌ విద్యుత్‌ చేతక్‌.. సరికొత్తగా

Bajaj Chetak: బజాజ్‌ ఆటో తన విద్యుత్‌ స్కూటర్‌ చేతక్‌ మోడల్‌లో 2024 వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. చేతక్‌ ప్రీమియం 2024, చేతక్‌ అర్బన్‌ 2024 వేరియంట్లలో ఇది లభించనుంది.

Updated : 05 Jan 2024 11:40 IST

ధర రూ.1.15- 1.35 లక్షలు

పుణె: బజాజ్‌ ఆటో తన విద్యుత్‌ స్కూటర్‌ చేతక్‌ (Bajaj Chetak) మోడల్‌లో 2024 వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. చేతక్‌ ప్రీమియం 2024, చేతక్‌ అర్బన్‌ 2024 వేరియంట్లలో ఇది లభించనుంది. చేతక్‌ అర్బన్‌ ధర రూ.1,15,001, చేతక్‌ ప్రీమియం ధర రూ.1,35,463 (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.ఇందులో అమర్చిన 3.2 కిలోవాట్‌ బ్యాటరీ ఒకసారి ఛార్జింగుతో 127 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. బజాజ్‌ కొత్త చేతక్‌ గరిష్ఠ వేగం గంటకు 73 కి.మీ. బ్లూటూత్‌, యాప్‌ అనుసంధానత, నోటిఫికేషన్‌ అలర్ట్‌;  వివిడ్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టీబీటీ నేవిగేషన్‌ సపోర్ట్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌, కాల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సదుపాయాలు ఈ స్కూటర్లలో ఉన్నాయి. హ్యాజిల్‌నట్‌, ఇండిగో మెటాలిక్‌ బ్లూ, బ్రూక్లిన్‌ బ్లాక్‌ రంగుల్లో కొత్త స్కూటర్లు లభిస్తాయి.మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించి చేతక్‌ ప్రీమియం, అర్బన్‌ 2024 స్కూటర్లను తీసుకొచ్చినట్లు బజాజ్‌ అధ్యక్షుడు (అర్బనైట్‌) ఎరిక్‌ వాస్‌ వెల్లడించారు. బజాజ్‌ విక్రయశాలలు, వెబ్‌సైట్‌పై కొత్త స్కూటర్లను బుక్‌ చేసుకునే సౌలభ్యం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు