కొత్త ఫీచర్లతో టీవీఎస్‌ హెచ్‌ఎల్‌ఎక్స్‌ 150ఎఫ్‌ బైక్‌

మోటార్‌సైకిల్‌ టీవీఎస్‌ హెచ్‌ఎల్‌ఎక్స్‌ అమ్మకాలు అంతర్జాతీయంగా 35 లక్షల స్థాయిని అధిగమించిన సందర్భంగా, అదనపు ఫీచర్లతో టీవీఎస్‌ హెచ్‌ఎల్‌ఎక్స్‌ 150ఎఫ్‌ను విడుదల చేస్తున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది.

Updated : 27 Feb 2024 06:45 IST

చెన్నై: మోటార్‌సైకిల్‌ టీవీఎస్‌ హెచ్‌ఎల్‌ఎక్స్‌ అమ్మకాలు అంతర్జాతీయంగా 35 లక్షల స్థాయిని అధిగమించిన సందర్భంగా, అదనపు ఫీచర్లతో టీవీఎస్‌ హెచ్‌ఎల్‌ఎక్స్‌ 150ఎఫ్‌ను విడుదల చేస్తున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది. అదనపు భద్రతా ఫీచర్లు, మెరుగైన సస్పెన్షన్‌, స్టైలింగ్‌ వంటి  సదుపాయాలతో ఈ మోడల్‌ను విడుదల చేయడం ద్వారా వినియోగదార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వివరించింది. ఈ బైక్‌ తొలిసారిగా పదేళ్ల కిందట ఆఫ్రికాలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని 50 దేశాల్లో లభ్యమవుతోంది. హెచ్‌ఎల్‌ఎక్స్‌ 150ఎఫ్‌ - శక్తిమంత ఎకోథ్రస్ట్‌ ఇంజిన్‌, అదనపు భద్రతా ఫీచర్లు, ఉన్నత సస్పెన్షన్‌, మెరుగైన స్టైలింగ్‌, కొత్త గ్రాఫిక్స్‌, ఉత్తేజకర రంగులతో రూపొందిందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (అంతర్జాతీయ వ్యాపారం) రాహుల్‌ నాయక్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు