హ్యుందాయ్‌ క్రెటా ఎన్‌ లైన్‌

మధ్యశ్రేణి స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) క్రెటా ఎన్‌లైన్‌ను హ్యుందాయ్‌ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్‌8, ఎన్‌10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించారు.

Updated : 12 Mar 2024 07:05 IST

ప్రారంభ ధర రూ.16.82 లక్షలు

దిల్లీ: మధ్యశ్రేణి స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) క్రెటా ఎన్‌లైన్‌ను హ్యుందాయ్‌ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్‌షోరూం). ఎన్‌8, ఎన్‌10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్‌లను ప్రారంభించారు. ఎన్‌లైన్‌ శ్రేణిలో ఇప్పటికే ఐ20 హ్యాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వెన్యూ ఉన్నాయి. ఎన్‌ లైన్‌, ప్రామాణిక మోడల్‌ వాహనాల మధ్య డిజైన్‌లో పలు మార్పులుంటాయి. కొత్త 18 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ అలాయ్‌వీల్స్‌, రెడ్‌ ఫ్రంట్‌, రేర్‌ బ్రేక్‌ కాలిపర్స్‌, గ్రిల్‌పై ఎన్‌ లైన్‌ బాడ్జింగ్‌ పలు డిజైన్‌ సంబంధిత మార్పులుంటాయి. ఎన్‌ లైన్‌ వినియోగదార్ల సగటు వయసు 36 ఏళ్లుగా ఉందని కంపెనీ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని