విపణిలోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టార్మ్‌

ఎంజీ (మోరిస్‌ గ్యారేజెస్‌) మోటార్‌ సంస్థ, తమ హెక్టార్‌ మోడల్‌లో సరికొత్త బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.

Updated : 11 Apr 2024 06:50 IST

ధర రూ.21.24 లక్షల నుంచి 

ఈనాడు, హైదరాబాద్‌: ఎంజీ (మోరిస్‌ గ్యారేజెస్‌) మోటార్‌ సంస్థ, తమ హెక్టార్‌ మోడల్‌లో సరికొత్త బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దేశంలో తొలి ఇంటర్నెట్‌ ఎస్‌యూవీ (స్పోర్ట్స్‌ వినియోగ వాహనం) ఇదని సంస్థ పేర్కొంది. నలుపు ఎక్స్‌టీరియర్స్‌, ఇంటీరియర్స్‌తో ఆకట్టుకునేలా తీసుకొచ్చిన ఈ వాహనం 5, 6, 7 సీట్ల సామర్థ్యంతో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ రూ.21.24- 22.75 లక్షల (ఎక్స్‌-షోరూం) శ్రేణిలో లభిస్తుంది. ఎంజీ హెక్టార్‌ అమ్మకాలు మరింత పెరిగేందుకు బ్లాక్‌స్టార్మ్‌ దోహద పడుతుందని ఎంజీ మోటార్‌ ఇండియా చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సతీందర్‌ సింగ్‌ బాజ్వా తెలిపారు. శక్తిమంతమైన విలాసవంత - అధునాతన కార్లను అందించేందుకు తాము ముందుంటామని పేర్కొన్నారు. ఐ-స్మార్ట్‌ సాంకేతికతతో 75కి పైగా కనెక్టెడ్‌ ఫీచర్లు, 100 వాయిస్‌ కమాండ్లను వినియోగించే వీలు ఈ కారులో వీలుందన్నారు. తొలిసారిగా డిజిటల్‌ బ్లూటూత్‌ కీని అందిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని