325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్‌ మార్టిన్‌ రూ.3.99 కోట్ల కారు

బ్రిటన్‌ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్‌ మార్టిన్‌ సరికొత్త ‘వాంటేజ్‌’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్‌కార్లలో ఇది రెండో మోడల్‌ అని కంపెనీ తెలిపింది.

Updated : 24 Apr 2024 06:52 IST

దిల్లీ: బ్రిటన్‌ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్‌ మార్టిన్‌ సరికొత్త ‘వాంటేజ్‌’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్‌కార్లలో ఇది రెండో మోడల్‌ అని కంపెనీ తెలిపింది. దీని ధరను రూ.3.99 కోట్లు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. ఇందులో అమర్చిన 4 లీటర్‌ వీ8 ట్విన్‌ టర్బో ఇంజిన్‌ 665పీఎస్‌/800 ఎన్‌ఎం శక్తిని అందిస్తుంది. గంటకు 0-96 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో ఈ కారు అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. వాంటేజ్‌ మోడల్‌ గరిష్ఠ వేగం గంటకు 325 కిలోమీటర్లు. బౌవర్స్‌ అండ్‌ విల్కిన్స్‌ ఆడియో వ్యవస్థ, అయిదు డ్రైవ్‌ మోడ్‌లు (వెట్‌, స్పోర్ట్‌, స్పోర్ట్స్‌ ప్లస్‌, ట్రాక్‌, ఇండివిడ్యువల్‌), అధునాతన డ్రైవర్‌ అసిస్టెన్స్‌ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు