బీజింగ్‌ ఆటోషో జిగేల్‌

చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్‌ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు.

Updated : 26 Apr 2024 07:28 IST

బీజింగ్‌: చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్‌ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. కొత్త ఇంధన వాహనాలు 278 చూపుతారు. మే నెల ప్రారంభం వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ వాహన తయారీసంస్థలు, ఈవీ అంకురాలు కొత్త మోడళ్లు, కాన్సెప్ట్‌ కార్లను ఆవిష్కరించనున్నాయి ఏఐ ఆధారిత ఆన్‌లైన్‌ అనుసంధాన కార్లు, ఆటోనమస్‌ డ్రైవింగ్‌ కార్లు, హైబ్రిడ్‌లు.. విద్యుత్‌ కార్లు సందడి చేయనున్నాయి.

  •  చైనా అతిపెద్ద ఈవీ కంపెనీ బీవైడీ.. రెండు ‘డ్యూయల్‌ మోడ్‌’ ప్లగిన్‌ కార్లను గురువారం ఆవిష్కరించింది. ఇవి బ్యాటరీతో నడుస్తాయి. లేదంటే హైబ్రిడ్‌ కారుగా మారతాయి. యాంగ్‌వాంగ్‌ బ్రాండ్‌లో 1,40,000 డాలర్ల శ్రేణిలో ఒక హైబ్రిడ్‌ ఆఫ్‌ రోడ్‌ ఎస్‌యూవీ(యూ8)నీ ప్రదర్శించింది. ఇంటెలిజెంట్‌ బాడీ కంట్రోల్‌ సిస్టమ్‌ ఫీచరుతో బీవైడీ తీసుకొస్తున్న యూ7 సైతం మెరిసింది. తన సరికొత్త విద్యుత్తు ప్లాట్‌ఫాంపై నిర్మితమైన తొలి విద్యుత్‌ వాహనం ఓషియన్‌-ఎమ్‌ను 20,699-27598 డాలర్ల శ్రేణిలో తీసుకురానున్నట్లు బీవైడీ ప్రకటించింది.
  •  షియోమీ తన ఎస్‌యూ7ను ప్రదర్శించింది. ఈ కారుకు ఇప్పటికే 75000 ఆర్డర్లు వచ్చాయి.
  •  నిస్సాన్‌ రెండు బ్యాటరీలతో ఈవీ కాన్సెప్ట్‌ కార్లను, రెండు ప్లగ్‌ ఇన్‌ పెట్రోల్‌-ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్స్‌ను ఆవిష్కరించింది.
  •  మాజ్దా సంస్థ ఈజడ్‌-6ను పరిచయం చేసింది. ఇది పూర్తి బ్యాటరీ ఈవీ లేదా ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ రూపంలో లభిస్తుందని తెలిపింది. ఒకసారి ఛార్జింగ్‌ బ్యాటరీ వర్షన్‌ 600 కి.మీ., ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ వర్షన్‌ 1,000 కి.మీ. ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
  •  టెస్లా మరోసారి ఈ ప్రదర్శనకు గైర్హాజరైంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని