Electric Vehicles: రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు

రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ICRA తెలిపింది.

Published : 23 Apr 2024 19:44 IST

దిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాల ఉత్పత్తిని విస్తరించేందుకు ఆటో కాంపోనెంట్‌ పరిశ్రమ వచ్చే 3-4 ఏళ్లలో రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని రేటింగ్‌ ఏజెన్సీ ICRA మంగళవారం తెలిపింది. ఇందులో దాదాపు 45-50 శాతం బ్యాటరీ సెల్స్‌పైనే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ICRA సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షంషేర్‌ దేవాన్‌ తెలిపారు. ఇప్పటికే దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందులో ఎక్కువ భాగం ద్విచక్ర వాహనాల రూపంలో ఉన్నాయి. అయితే, ఎలక్ట్రిక్‌ 3-వీలర్లు, బస్సులు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయని ICRA ఓ ప్రకటనలో తెలిపింది.

వాహన ధరలో దాదాపు 35-40 శాతం వాటాతో అత్యంత క్లిష్టమైన, ఖరీదైన భాగం అయిన అధునాతన బ్యాటరీలను భారత్‌ దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. 2030 నాటికి దేశీయ ద్విచక్ర వాహనాల్లో 25 శాతం, ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల్లో 15 శాతం EVలు ఉంటాయని రేటింగ్‌ ఏజెన్సీ అంచనా. దీని ప్రకారం 2030 నాటికి దేశీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన భాగాల మార్కెట్‌ రూ.1 లక్ష కోట్లకు మించి ఉంటుందని ICRA అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని