Hero Vida V1 pro: హీరో విదా వీ1 ప్రోపై డిస్కౌంట్‌.. ఆఫర్లు ఇవే!

Hero Vida V1 pro: హీరో తన విదా వీ1 ప్రో మోడల్‌పై డిస్కౌంట్‌ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజీ బోనస్‌ కూడా ఇస్తోంది.

Published : 22 Jan 2024 21:58 IST

Hero Vida V1 pro | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero motocorp) తన విదా విద్యుత్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. విదా వీ1 ప్రో (Vida V1 Pro) మోడల్‌పై రూ.24 వేలు వరకు తగ్గింపు ప్రయోజనాలు ఇస్తోంది. ఇందులో రూ.2,500 వరకు నగదు ప్రయోజనంతో పాటు రూ.6,600 ఈఎంఐ బెనిఫిట్‌, బ్యాటరీ వారెంటీ పొడిగింపుపై 50 శాతం రాయితీ, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌పై రూ.2,500, హీరో కస్టమర్లకు లాయల్టీ బోనస్‌ కింద రూ.5 వేలు, కార్పొరేట్‌ డిస్కౌంట్ కింద రూ.2500, రూ.1,125 విలువైన ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను అందిస్తున్నారు. పోర్టబుల్‌ ఛార్జర్‌, ఫేమ్‌-2 సబ్సిడీతో కలిపి దిల్లీలో ఈ స్కూటర్‌ ధర రూ.1.25 లక్షలుగా ఉండగా.. ఇతర ప్రాంతాల్లో రూ.1.45 లక్షలు ఉంది.

హీరో విదా వీ1 ప్రో కొనుగోలుపై రుణ సదుపాయం కూడా ఉంది. హీరో ఫిన్‌కార్ప్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఎకోఫై, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ సంస్థలు రుణాలను అందిస్తున్నాయి. 5.99 శాతం వడ్డీ రేటుతో కేవలం రూ.499 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయడం లేదు. విదా వీ1 ప్రో ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్కూటర్‌ 110 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తోంది. టాప్‌ స్పీడ్‌ 80 కిలోమీటర్లు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీని ఛార్జ్‌ చేయొచ్చు. వెనుక సీటును తొలగించుకునే సదుపాయం ఉంది. బ్యాటరీని సైతం తొలగించి ఇంట్లోనే ఛార్జ్  చేసుకోవచ్చు. టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, 26 లీటర్ల బూట్‌ స్పేస్‌, ఎమర్జెన్సీ అలర్ట్‌ స్విచ్‌, బ్లూటూత్‌, వైఫై, 4జీ, నావిగేషన్‌, జియో ఫెన్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐదేళ్లు/ 50వేల కిలోమీటర్ల వెహికల్‌ వారెంటీ, 3ఏళ్లు/30వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో ఈ స్కూటర్‌ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు