Maruti Suzuki WagonR: 30 లక్షలు దాటిన మారుతీ వేగనార్‌ విక్రయాలు

Maruti Suzuki WagonR: హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో వేగనార్‌ 1999లో మార్కెట్‌లోకి వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జత చేసుకుంటూ కస్టమర్లకు చేరువైంది.

Published : 16 May 2023 16:46 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీకి చెందిన వేగనార్ (Maruti Suzuki WagonR) కారు విక్రయాలు 30 లక్షల మైలురాయిని దాటాయి. 1,999లో ఈ మోడల్‌ను కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2008 నాటికి ఐదు లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. 2017లో 20 లక్షలు, 2021లో 25 లక్షలు, 2023లో 30 లక్షల విక్రయాల మైలురాయిని అందుకుంది. హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌కు చెందిన ఈ కారులో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వచ్చారు. తమ మోడళ్లలో అత్యధికంగా రీపీట్‌ కొనుగోలుదారులు ఉన్న కారు వేగనారేనని కంపెనీ ప్రతినిధి శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. దాదాపు 24 శాతం మంది తమ పాత వేగనార్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకున్నారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు