Splendor Plus Xtec: స్ల్పెండర్‌కు 30 ఏళ్లు.. అధునాతన ఫీచర్లతో కొత్త వెర్షన్‌ విడుదల

Splendor Plus Xtec: స్ల్పెండర్ మార్కెట్‌లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది.

Published : 31 May 2024 11:48 IST

దిల్లీ: భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన బైక్‌ స్ల్పెండర్‌. ఇది మార్కెట్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. స్ల్పెండర్‌+ ఎక్స్‌టెక్‌ 2.0 (Splendor Plus Xtec 2.0) పేరిట వస్తున్న ఈ బైక్‌ ధర రూ.82,911 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). గత ఎక్స్‌టెక్‌ వెర్షన్‌తో పోలిస్తే రూ.3,000 అధికం.

డిజైన్‌పరంగా స్ల్పెండర్‌+ ఎక్స్‌టెక్‌ 2.0లో (Splendor Plus Xtec 2.0) హీరో పెద్దగా మార్పులు చేయలేదు. ఫీచర్లను మాత్రం అధునాతనంగా తీర్చిదిద్దింది. పొజిషన్‌ ల్యాంప్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ను అప్‌డేట్‌ చేశారు. వెనక భాగంలో హెచ్‌ ఆకారంలో ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌ను ఇచ్చారు. మ్యాట్‌ గ్రే, గ్లోస్‌ బ్లాక్‌, గ్లోస్‌ రెడ్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. సైడ్‌ హుక్స్‌, ట్యూబులార్ గ్రాబ్‌ రెయిల్‌, ఇంజిన్‌ క్రాష్‌ గార్డ్‌ వంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. సీటు పొడవును, గ్లవ్‌ బాక్స్‌ పరిమాణాన్ని పెంచారు.

స్ల్పెండర్‌+ ఎక్స్‌టెక్‌ 2.0లో (Splendor Plus Xtec 2.0) పూర్తిగా డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ను ఇచ్చారు. ఎకో ఇండికేటర్‌, రియల్‌-టైమ్‌ మైలేజీ సూచీ, సర్వీస్‌ రిమైండర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ ఫీచర్లు ఉన్నాయి. యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌, కాల్స్‌, మెసేజ్‌లు, బ్యాటరీ అలర్ట్స్‌ కోసం బ్లూటూత్‌ కనెక్టివిటీని కూడా ఇచ్చారు. బ్యాంక్‌ యాంగిల్‌ సెన్సర్‌, హజార్డ్‌ స్విచ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త స్ల్పెండర్‌ 100 సీసీ సింగిల్‌ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 7.09 బీహెచ్‌పీ శక్తి, 8.05 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫోర్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో అనుసంధానం చేశారు. లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. సర్వీస్‌ వ్యవధిని 6,000 కిలోమీటర్లకు పెంచినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని