OpenAI app store: యాపిల్, గూగుల్‌కు పోటీగా ఓపెన్‌ఏఐ సొంత యాప్‌ స్టోర్‌

Eenadu icon
By Business News Team Published : 07 Oct 2025 19:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

OpenAI app store | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ ఇప్పుడు సొంత యాప్‌ స్టోర్‌ను తీసుకొస్తోంది. ఈ యాప్‌ స్టోర్‌ను నేరుగా చాట్‌జీపీటీలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వినియోగదారులు తమ సొంత భాషలోనే యాప్‌లతో సంభాషిస్తూ వాటిని ఉపయోగించుకునే సౌకర్యం కల్పించనుంది. తద్వారా ప్రస్తుత మొబైల్‌ యాప్‌ ఎకోసిస్టమ్‌ను సమూలంగా మార్చివేసే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. తద్వారా గూగుల్‌, యాపిల్‌ వంటి దిగ్గజాలకూ పోటీ ఇవ్వనుంది.

ఓపెన్‌ఏఐ డెవ్‌డే (DevDay) ఈవెంట్‌ సందర్భంగా ఈ కొత్త యాప్‌ స్టోర్‌ గురించి ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ఇది సాధారణ చాట్‌బాట్‌ మాత్రమే కాకుండా, వ్యక్తిగత అనుభవాన్ని అందించే ఇంటరాక్టివ్‌ యాప్‌ల కేంద్రంగా మారనుంది. దీన్నో కొత్తం తరం యాప్‌గా ఓపెన్ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్ అభివర్ణించారు. వినియోగదారులు చాట్‌జీపీటీని అడిగి స్పాటిఫైలో ప్లేలిస్ట్‌ సృష్టించడం, ప్రాపర్టీ యాప్‌లో ప్రాపర్టీలు వెతకడం వంటి పనులు చేయొచ్చు. చాట్‌జీపీటీ వినియోగదారులకు ఏ యాప్‌లను కనెక్ట్‌ చేయాలో, ఏ డేటా పంచుకోవాలో సూచిస్తుంది. దీంతో సంప్రదాయ యాప్‌లతో పోలిస్తే ఇది మరింత ప్రైవసీ-స్నేహపూర్వకమైన, సంభాషణాత్మక ఇంటర్‌ఫేస్‌గా ఉంటుందని శామ్‌ ఆల్ట్‌మన్ తెలిపారు.

ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్ల మాదిరిగా సాఫ్ట్‌వేర్‌ను డివైజ్‌లోకి డౌన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. చాట్‌జీపీటీలోనే మనకు అవసరమైన యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌లను డెవలప్‌ చేయడానికి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (ఎస్‌డీకే)ను అందిస్తోంది. ఈ ఏడాది చివర్లో యాప్‌ల సబ్మిషన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. డెవలపర్‌లకు తమ యాప్‌ల ద్వారా ఆదాయం పొందే మార్గాల గురించి కూడా కంపెనీ వివరించనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన కామర్స్‌ ఫంక్షనాలిటీ ద్వారా వినియోగదారులు నేరుగా చాట్‌జీపీటీ యాప్‌లోనే కొనుగోళ్లు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు