టాప్‌గేర్‌లో టూవీలర్‌ విక్రయాలు.. ఏ కంపెనీ ఎన్నంటే?

Two wheeler Sales in November: దేశీయ కంపెనీలు టూవీలర్‌ అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. నవంబర్‌లో భారీగా వాహనాలను విక్రయించాయి. 

Published : 01 Dec 2023 18:44 IST

Two wheeler Sales | ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్విచక్ర వాహన విక్రయాల్లో దేశీయ కంపెనీలు దూసుకెళ్లాయి. దీపావళి పండగ నేపథ్యంలో నవంబర్‌లో భారీగా విక్రయాలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగినట్లు ఆయా కంపెనీలు వెలువరించిన గణాంకాలు చెబుతున్నాయి. హోండా, టీవీఎస్‌, బజాజ్‌ కంపెనీలు మెరుగైన నంబర్లను నమోదు చేశాయి.

  • నవంబర్‌ నెలలో Honda మోటార్‌ సైకిల్ అండ్‌ స్కూటర్‌ ఇండియా 4,47,849 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 3,73,234 యూనిట్లతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. ఇందులో దేశీయంగా 4,20,677 యూనిట్లు విక్రయించగా.. 27,172 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది.
  • ఆటోమొబైల్‌ కంపెనీ TVS నవంబర్‌ నెలలో 3,64,231 యూనిట్లను విక్రయించింది. ఇందులో 3,52,103 టూవీలర్లు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన 2,63,642తో పోలిస్తే విక్రయాలు 34 శాతం పెరగడం గమనార్హం. మొత్తం విక్రయాల్లో 1,72,836 మోటార్‌ సైకిళ్లు, 1,35,749 స్కూటర్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. 16,782 ఐక్యూబ్‌ విద్యుత్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను నవంబర్‌ నెలలో విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.
  • బజాజ్‌ ఆటో వాహన విక్రయాల్లో 31 శాతం వృద్ధిని నమోదు చేసింది. నవంబర్‌ నెలలో టూవీలర్లు, కమర్షియల్‌ వాహనాలు కలిపి 4,03,003 యూనిట్లను ఆ కంపెనీ విక్రయించింది. 3,49,048 టూవీలర్లను ఒక్క నెలలో విక్రయించింది. దేశీయ అమ్మకాల్లో 77 శాతం వృద్ధి నమోదు అవ్వగా.. ఎగుమతులు 6 శాతం మేర క్షీణించాయి. 
  • రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ నవంబర్‌లో 80,251 మోటార్‌ సైకిళ్లను విక్రయించింది. గతేడాది 70,766 మోటార్‌ సైకిళ్లను విక్రయించగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 84,435 వాహనాలను విక్రయించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని