Cyber Crime: పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల స్కామ్‌.. రూ.32.34 కోట్లు అటాచ్‌

పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల స్కామ్‌లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ ) తెలిపింది.

Updated : 28 Mar 2024 17:44 IST

హైదరాబాద్‌: పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల స్కామ్‌లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ ) తెలిపింది. పార్ట్‌ టైమ్‌ జాబ్‌ల పేరుతో జరిగిన మోసాలపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో 50కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా నిరుద్యోగులకు వల వేశారు. హోటల్స్‌, టూరిస్ట్‌ వెబ్‌సైట్లు, రిసార్టులు వంటి వాటికి రేటింగ్‌ ఇస్తే ఆదాయం వస్తుందని నమ్మించారు. బోగస్‌ మొబైల్‌ అప్లికేషన్లు సృష్టించి పెట్టుబడులు పెట్టించారు. యూఏఈలో ఉన్న కీలక నేరగాళ్లు ఇదంతా చేయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. భారత్‌లో బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలో సైబర్‌ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును ఆ ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఇప్పటి వరకు 175 ఖాతాల ద్వారా రూ.524 కోట్లు కాజేసినట్టు ఈడీ గుర్తించింది. వీటిని మరో 480 ఖాతాలకు మళ్లించి క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటిస్తున్నట్టు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని