ఆర్టీసీ బస్సు ఢీకొని దుర్మరణం
పుల్లలపాడు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు.
రామ సత్యసాయి
నల్లజర్ల: పుల్లలపాడు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. నల్లజర్ల గ్రామానికి చెందిన గన్నిన రామ సత్యసాయి(29) నెల్లూరు జిల్లా కావలిలో ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చారు. మంగళవారం వ్యక్తిగత పనుల నిమిత్తం భీమడోలు వెళ్లి రాత్రి సమయంలో తిరిగొస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. శవపంచనామా కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం జరగలేదు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాంబాబు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!