‘అమరరాజా’లో అదుపులోకి వచ్చిన మంటలు

చిత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి సమీపంలోని అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో సోమవారం సాయంత్రం రాజుకున్న మంటలు మంగళవారం తెల్లవారేవారకూ ఎగిసిపడ్డాయి.

Published : 01 Feb 2023 04:06 IST

యాదమరి, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి సమీపంలోని అమరరాజా గ్రోత్‌ కారిడార్‌లో సోమవారం సాయంత్రం రాజుకున్న మంటలు మంగళవారం తెల్లవారేవారకూ ఎగిసిపడ్డాయి. 3 అగ్నిమాపక శకటాలు నిర్వరామంగా మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. బ్యాటరీ తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్‌, లెడ్‌ ఉండటంతో అవి కొవ్వొత్తుల్లా కరిగి మండుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటనా స్థలాన్ని చిత్తూరు, పలమనేరు ఆర్డీవోలు రేణుక, శివయ్య పరిశీలించారు. అమరరాజా ప్రతినిధులతో మాట్లాడి జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ట్యూబులర్‌ బ్యాటరీ తయారీ యూనిట్‌ పూర్తిగా కాలిపోయిందని, నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని