సీఎస్‌ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్‌

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌)ను వినియోగించి సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు.

Published : 30 Apr 2024 04:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌)ను వినియోగించి సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. నేపాల్‌ కోడ్‌తో ఉన్న మొబైల్‌ నంబర్‌తో నకిలీ కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. మొదట స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవసేనకు, తరవాత మంచిర్యాల అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌కు నకిలీ కాల్స్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారు. అనుమానం వచ్చి వాకబు చేయగా..నకిలీ కాల్స్‌గా తేలాయి. అది సీఎస్‌ శాంతికుమారి మొబైల్‌ నంబర్‌ కాదని.. ఆ నంబర్‌ నుంచి కాల్స్‌, మెసేజ్‌లు పంపిన సైబర్‌ నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె వ్యక్తిగత కార్యదర్శి రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని