నీళ్ల ట్యాంకు కూలి మహిళ మృతి
నీళ్ల ట్యాంకు గోడలు కూలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడులో మంగళవారం చోటు చేసుకుంది.
త్రిపురాంతకం, న్యూస్‌టుడే: నీళ్ల ట్యాంకు గోడలు కూలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడులో మంగళవారం చోటు చేసుకుంది. దూపాడు గ్రామానికి చెందిన అల్లంరాజు వెంకట నారాయణమ్మ (42), అమ్మిరెడ్డి తిరుపతమ్మ మంగళవారం ఉదయం నీరు తెచ్చుకునేందుకు గ్రామంలోని నీళ్లట్యాంకు వద్దకు వెళ్లారు. అక్కడ బిందెలతో నీళ్లు పడుతుండగా ఒక్కసారిగా ట్యాంకు గోడలు రెండు వైపులా కూలాయి. అక్కడే ఉన్న నారాయణమ్మ, తిరుపతమ్మలపై గోడలు పడ్డాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో స్థానికులు వెంటనే త్రిపురాంతకంలోని ఓ వైద్యశాలకు తరలించారు. నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!