తల నరికి సెల్ఫీలు తీసుకున్నారు

భూ వివాదానికి సంబంధించి ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న అతడి బంధువు తల నరికేశాడు. అనంతరం అతడి స్నేహితులు ఆ తలతో స్వీయచిత్రాలు తీసుకుని పైశాచిక ఆనందం పొందారు.

Updated : 07 Dec 2022 05:36 IST

భూ వివాదానికి సంబంధించి ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న అతడి బంధువు తల నరికేశాడు. అనంతరం అతడి స్నేహితులు ఆ తలతో స్వీయచిత్రాలు తీసుకుని పైశాచిక ఆనందం పొందారు. క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ దారుణ సంఘటన ఝార్ఖండ్‌లోని కుంతీ జిల్లా ముర్హు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 1న కుటుంబసభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కాను ముండా(24)ను అతడి బంధువుల్లో ఒకరైన సాగర్‌ ముండా స్నేహితులతో కలిసి అపహరించాడు.  సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తల నరికి చంపేశాడు. తెగిపడిన ఆ తలతో సాగర్‌ స్నేహితులు స్వీయచిత్రాలు తీసుకున్నారు. మరోవైపు, పొలం నుంచి ఇంటికి చేరుకున్న బాధితుడి తండ్రి కుమారుడి కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదు. కానును బంధువులే ఎత్తుకెళ్లినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పారు. దీంతో కాను తండ్రి రెండో తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రధాన నిందితుడు, అతడి భార్య సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు చెప్పిన వివరాల ఆధారంగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాను మొండెం కుమాంగ్‌ గోప్లా అడవిలో, తల దుల్వా తుంగ్రీ ప్రాంతంలో దొరికింది. మృతుడి సెల్‌ఫోన్‌తో పాటు మరో ఐదు మొబైల్‌ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రెండు పదునైన ఆయుధాలు, ఓ గొడ్డలి, ఒక ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న భూ వివాదమే ఈ హత్యకు కారణమని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు