Crime News: బాలికను గర్భవతిని చేసిన ట్యూషన్‌ మాస్టారు

తన దగ్గర చదువు నేర్చుకునేందుకు వచ్చిన ఓ బాలికను ట్యూషన్‌ మాస్టారు గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు విజయనగరం

Updated : 23 Sep 2021 11:10 IST

 

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: తన దగ్గర చదువు నేర్చుకునేందుకు వచ్చిన ఓ బాలికను ట్యూషన్‌ మాస్టారు గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదోతరగతి విద్యార్థిని (16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్‌ సెంటర్‌కు వెళుతోంది. ఆ అమ్మాయిపై ట్యూషన్‌ మాస్టారు కన్నేశాడు. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. ‘నీకు తెలివి లేదు.. మేధాశక్తి పెంచుతాను. అందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అంటూ బాలికను లోబర్చుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ బాలిక సరిగ్గా తినకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె గర్భవతి అని, ఎనిమిదో నెల అని వైద్యులు తెలిపారు. వెంటనే బాధితులు దిశ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్‌ తెలిపారు. ఇతడికి అక్క కుమార్తెతో పెళ్లయిందని, ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్‌ చెబుతున్నాడని చెప్పారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని