Hyderabad: పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం.. 9 మంది అరెస్టు

పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్న 9 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 22 Jul 2023 13:11 IST

హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో మోసాలు చేస్తున్న 9 మంది సైబర్‌ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, లఖ్‌నవూ, గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన ఈ నిందితులకు.. దుబాయ్, చైనాకు చెందిన నేరస్థులతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.712 కోట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్రవాదుల క్రిప్టో వెబ్‌సైట్‌కు

ఈ కేసు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ నగర సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఈ డబ్బంతా పలు మార్గాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనా వెళ్తోందని వివరించారు. తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో వెబ్‌సైట్‌కు ఈ డబ్బు వెళ్లినట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ తరహా మోసాలపై జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాల్సి ఉందని.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యపరుస్తున్నా.. కొంత మంది అమాయకులు మోసపోతూనే ఉన్నారన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం సైబర్ మోసాల బారిన పడుతున్నారని.. శుక్రవారం ఓ ఐటీ ఉద్యోగి 82 లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని